టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి స్టామినాతో పాటు ఫాలోయింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఓ పక్క యంగ్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమానే అంటూ మడి కట్టుకుని కూర్చుంటే.. సీనియర్ హీరోలు చిరు, బాలయ్య లు మాత్రం జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తమ సినిమాలతో.. యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు.
1999 నుండి చిరంజీవి బాలకృష్ణ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉండేది. సంక్రాంతికి ఈ ఇద్దరు పోటీ పడగా బాలయ్యనే ఈ పోటీలో గెలిచాడు. చిరంజీవి 1999లో స్నేహం కోసం సినిమాతో పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం వందరోజులు ఆడడమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఈ సినిమాలోచిరు నటనకు ఉత్తమనటుడు అవార్డు వచ్చింది. ఇక ఈ సినిమా తరవాత కృష్ణ హీరోగా నటించిన మానవుడు దానవుడు విడుదలైంది. ఈ ప్రవాహంలో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇదే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య సమరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథను రాశారు.
సమరసింహారెడ్డి సునామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట ఈ చిత్రం కొన్ని థియేటర్ లలో విడుదలై వందలరోజులు ఆడింది. ఈ సినిమాకి కోట్లల్లో కలెక్షన్స్ రాగా, సమరసింహారెడ్డి సినిమా విడుదల తరవాత చిరంజీవి స్నేహం కోసం సినిమా కలెక్షన్స్ డల్ అయ్యాయి. మరోవైపు సుమన్ హీరోగా నటించిన పెద్దమనుషులు సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాగా సమరసింహారెడ్డి దెబ్బకు తట్టుకోలేక ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. అలా ఆ ఏడాది బాలయ్య విజృంభించి రచ్చ చేశాడు.