వినోదం

ఎన్టీఆర్ కెరీర్ లో ఒక్కరోజు కూడా ఆడని పరమ చెత్త సినిమా ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా పోస్టర్లలో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు థియేటర్లకు వెళ్లిపోయేవారు. ఆయననూ తన కుటుంబ సభ్యుడి లాగా భావించేవారు. అంతేకాదు ఆయనను ఆప్యాయంగా పిలిచేవారు. అంతలా తన పాత్రలతో అభిమానులపై సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్రవేశారు.

అయితే ఈయన కెరియర్ లో కూడా ఒక ఘోర డిజాస్టర్ మూవీ ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. 1960లో విడుదలైన ఆ సినిమా పేరు కాడెద్దులు ఎకరం నేల. ఇక ఆ సంవత్సరం ఎన్టీఆర్ పది సినిమాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ఏడాది మంచి జోష్ లో ఉన్న టైం లో కాడెద్దులు ఎకరం నేల సినిమా విడుదలై అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో పేద రైతుగా ఎన్టీఆర్ నటించారు. అదేవిధంగా షావుకారు జానకి హీరోయిన్ గా చేసింది.

do you know that this sr ntr movie became disaster

ఇక జంపన్న డైరెక్షన్ లో వచ్చిన భ‌ట్టి విక్రమార్క సినిమా అదే నెలలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న టైం లోనే అదే వారంలో మళ్లీ ఆ డైరెక్టరే దర్శకత్వం వహించిన కాడెద్దులు ఎకరం నేల అనే సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ రోజుల్లో ఎన్టీఆర్ సినిమా అంటే చాలా క్రేజ్ ఉండేది. కొత్త సినిమా విడుదల అయితే జనం ఎగబడి చూసేవారు. అలాగే కాడెద్దులు ఎకరం నేల సినిమా చూడడానికి కూడా చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కానీ ఈ సినిమా చూసి అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Admin

Recent Posts