Actors : ప్రేమకు ఎల్లలు, హద్దులు అనేవి ఉండవు. కులం, మతం అంటూ అడ్డుగోడలు ఉండవు.రంగు, రూపు అనే తేడాలు ముందుకు రావు. అందుకే చాలా మంది సినిమా సెలబ్రిటీలు వయసుతో పనిలేకుండా ప్రేమకథలు నడిపించారు.మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్‌లోను కొందరు స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంత మంది స్టార్స్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది.
కోలీవుడ్‌లో సూర్య జ్యోతిక మోస్ట్ పాపులర్ లవబుల్ కపుల్ అనే విషయం తెలిసిందే. ఏడు సినిమాలకు పైగా కలిసి పని చేసిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకోగా, సూర్య కన్నా జ్యోతిక మూడేళ్లు చిన్నది. ఇక సమంత- నాగ చైతన్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో చూడముచ్చటైన ఈ జంట అనుకోని కారణాల వలన విడాకులు తీసుకున్నారు. అయితే చైతూ.. సమంత కన్నా ఏడాది పెద్ద. ఇక వరణ్ సందే్ వితికా జంట విషయానికి వస్తే.. పడ్డానండి ప్రేమలో చిత్రంలో వితికాతో కలిసి నటించాడు వరుణ్ సందేశ్. ఆ సమయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వితిక .. వరుణ్ కన్నా మూడు సంవత్సరాలు పెద్దది.
నాగార్జున అమల ఎంత రొమాంటిక్ కపుల్ మనందరికి తెలిసిందే. రామానాయుడు కూతురు లక్ష్మీకి విడాకులు ఇచ్చిన తర్వాత అమలని పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున కన్నా అమల ఎనిమిది సంవత్సరాలు చిన్నది. ఇక రామ్ చరణ్- ఉపాసన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాసన రామ్ చరణ్ కన్నా ఐదు సంవత్సరాలు చిన్నది. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం కాగా, ప్రణీత.. ఎన్టీఆర్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్నది.