ఒక సినిమాలో నటించే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం సహజం..కానీ కొంతమంది వయసు తెలిస్తే ఔరా అని ముక్కున వేలేసుకోకుండా ఉండలేం..ఒకప్పుడు శ్రీదేవి బాలనటిగా ఎన్టీయార్ మనవరాలిగా నటించి..తర్వాత అదే ఎన్టీయార్ సరసన హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇద్దరి మధ్యన ఎంత ఢిఫరెన్స్ ఉంటుందో చెప్పక్కర్లేదు..అయితే ఈ విషయంలో శ్రీదేవి నిజంగా గ్రేట్..ఆనాటి నటులు ఎన్టీయార్,ఏఎన్నార్,క్రిష్ణ,క్రిష్ణంరాజు,శోభన్ బాబులతోనే కాదు తర్వాతి తరం నటులు చిరు,నాగ్,వెంకీ సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ తరం నటులతో కూడా నటించేంత అందం,అభినయం శ్రీదేవి సొంతం.శ్రీదేవితో పోల్చలేం కానీ శ్రీయ కూడా ఇప్పుడు అదే విధంగా ముందుకు పోతుంది..వయసు పెరుగుతున్నా కొద్ది అందం పెరుగుతుందా అనిపిస్తుంది శ్రీయను చూస్తుంటే…సరే ఇప్పుడు టాపిక్ మాట్లాడుకుందాం..
మన తెలుగు సినిమాల్లో హీరోలు నటిస్తూనే ఉంటారు..ఎలా అంటే వృద్ధాప్య వయసుకు వచ్చినా కూడా కుర్రపాత్రలు పోషిస్తూనే ఉంటారు..మన హీరోయిన్లు మాత్రం చిన్న వయసులోనే వచ్చినా మధ్యలోనే పెళ్లి పిల్లలు అంటూ వెళ్లిపోతుంటారు..మళ్లీ కొత్త హీరోయిన్స్ వస్తారు.మన హీరోలు మాత్రం హీరోలుగానే ఉంటారు..ఆ విధంగా వచ్చిన మన కథానాయికలకు మన సీనియర్ కథానాయకుల మధ్య వయసు ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా..ఒక లుక్కేయండి. పవన్,ప్రణీత (అత్తారంటికి దారేది).. ఈ సినిమా అప్పటికి పవన్ వయసు 42,ప్రణీత వయసు 21 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 21 ఏళ్లు. రవితేజా,రాశిఖన్నా (బెంగాల్ టైగర్).. రవితేజ వయసు 47,రాశి వయసు 24 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 23 ఏండ్లు.
వెంకటేశ్,జెనీలియా (సుభాష్ చంద్రబోస్).. వెంకటేశ్ వయసు44, జెనీలియా వయసు 18 ఇద్దరి మధ్యా వ్యత్యాసం 26 ఏండ్లు. నాగార్జున, అయేషా టాకియా(సూపర్).. నాగార్జున వయసు 46,అయేషా వయసు19 ఇద్దరి మధ్యా తేడా 27 ఏండ్లు. బాలక్రిష్ణ, ఇషా చావ్లా (శ్రీమన్నారాయణ).. బాలక్రిష్ణ వయసు 52,ఇషా చావ్లా వయసు24 వీరిద్దరి మధ్యా 28 ఏండ్లు తేడా. చిరంజీవి, త్రిష (స్టాలిన్).. చిరంజీవి వయసు51, త్రిష 23 వయసు, ఇద్దరి మధ్యా వయసులో వ్యత్యాసం 28ఏళ్లు. కమల్ హాసన్,త్రిష(చీకటిరాజ్యం). కమల్ వయసు 61,త్రిష వయసు32 ఇద్దరి మధ్యా తేడా 29ఏళ్లు.
చిరంజీవి,కాజల్(ఖైదీ నెం150). మెగాస్టార్ చిరంజీవి వయసు 61, కాజల్ వయసు31 ఇద్దరి మధ్యా వయసులో తేడా 30 ఏళ్లు. రజిని కాంత్,సోనాక్షి (లింగా). సూపర్ స్టార్ రజిని వయసు63, బాలివుడ్ భామ సోనాక్షి 27 వయసు ఇద్దరి మధ్యా వయసులో తేడా 36ఏళ్లు ఉంది.