వినోదం

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?

చిరంజీవి స్పూర్తిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కెరీర్ మొదలై 20 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు చేయ‌డం కుద‌ర‌లేదు. అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ చేజారిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

జయం, గీత‌ గోవిందం, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, భద్ర, 100 పర్సెంట్ లవ్, పండగ చేస్కో చిత్రాల‌ని బ‌న్నీ వ‌దిలేయ‌గా ఇవి మంచి విజ‌యం సాధించాయి. ఇక బన్నీ వదిలేసిన డిజాస్టర్ సినిమాల విష‌యానికి వ‌స్తే .. డిస్కో రాజా, జాను, కృష్ణాష్టమి, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఉన్నాయి. అల్లు అర‌వింద్ తన కుమారుడి బాధ్యతలు తేజకు అప్పగించాలని అప్పట్లో భావించాడు . ఈ క్రమంలోనే జయం సినిమా ముందు బన్నీతో చేయాలనుకున్నారు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అదే సినిమా నితిన్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. ఆర్య లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తున్న స‌మ‌యంలో భ‌ద్ర ఆఫ‌ర్ వ‌చ్చింది. మాస్ మసాలా సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. అలా భద్ర సినిమాను వదిలేశాడు అల్లు అర్జున్.

do you know that allu arjun rejected these movies

100 % లవ్ సినిమా కథ ని ముందు బన్నీకి చెప్పాడు సుకుమార్. కానీ ఎందుకో ఈ కథకు అసలు కనెక్ట్ కాలేకపోయాడు అల్లు అర్జున్. సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమాలో ముందు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది. కాని బ‌న్నీ రిజెక్ట్ చేయ‌డంతో సునీల్ చేశాడు.అర్జున్ రెడ్డి వంటి సంచలన కథ ముందు అల్లు అర్జున్ కి చెప్పాడు సందీప్. అయితే అలాంటి కథ చేయడానికి బన్నీ ధైర్యం చేయలేకపోయాడు. దాంతో ఇదే సినిమా విజయ్ దేవరకొండతో చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇలా బ‌న్నీ ప‌లు సినిమాల‌ని రిజెక్ట్ చేయ‌గా, ఇందులో కొన్ని మంచి విజ‌యాలు సాధించ‌గా, మ‌రి కొన్ని ఫ్లాప్స్ గా మారాయి.

Admin