Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పవన్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలకి టైం అడ్జస్ట్ చేస్తూ ఉండటంతో ఆయన సినిమాలు మరింత ఆలస్యం అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కరోనా వల్ల, పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇది పీరియాడికల్ మూవీ కావడం, ఇందులో పవన్ బందిపోటుగా నటిస్తుండటం, ఫైట్స్ ఎక్కువగా ఉండటంతో పవన్ ఆ పాత్రకోసం రకరకాల శిక్షణలు తీసుకుంటున్నాడు.
కొన్ని రోజుల క్రితం పవన్ శిక్షణ తీసుకుంటున్న కొన్ని ఫోటోలు బయటకి రాగా , ఈ సినిమాల్లో తన కరాటే విద్యలని కూడా ప్రదర్శించాడు. హరిహర వీరమల్లు షూట్ సెట్ లో పవన్ కరాటే డ్రెస్ లో కనిపించడంతో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం పవన్ మాత్రం చాలా కష్టపడుతున్నాడు. పవన్ గతంలో కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు. కొన్ని సినిమాల్లో తన కరాటే విద్యలని కూడా ప్రదర్శించిన పవన్ ఇప్పుడు హరిహర వీరమల్లు షూట్ సెట్ లో పవన్ కరాటే డ్రెస్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు.
మార్షల్ ఆర్ట్స్‌లో దిట్ట అని తెలుసు. ఎన్నో సినిమాల్లో మార్షల్ ఆర్ట్ట్స్ స్టైల్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన పవన్ కళ్యాణ్‌కు తొలూత మార్షల్ ఆర్ట్స్ అంటే అంత ఇష్టం ఉండేది కాదట. నాగబాబు కూడా చినప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని సలహా ఇస్తే అలాంటివి నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడట. కాలేజీలో చేరాక అక్కడి విద్యార్థులు కొంత మంది చిరంజివి మూవీస్ గురించి నెగెటివ్‌గా మాట్లాడడంతో వారిని ఎలాగైనా కొట్టాలని అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం పవన్ కూల్ అండ్ కామ్‌గా ముందుకు సాగుతున్నారు.