వినోదం

న‌ర‌సింహ‌నాయుడు చిత్రంతో బాల‌కృష్ణ సాధించిన ఎవ‌ర్‌గ్రీన్ రికార్డ్ ఏంటో తెలుసా?

నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌ర‌సింహ‌నాయుడు చిత్రం ఒక‌టి. 2001 జనవరి 11న విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌‌ను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగులో తొలి రూ. 21.81 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రంగా రికార్డులకు ఎక్కింది నరసింహనాయుడు. మొత్తంగా రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో తొలిసారి వందకు పైగా 105 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా ఆషా సైనీ కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది.

ద‌ర్శ‌కుడు బి.గోపాల్, సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్‌లో న‌ర‌సింహానాయుడు సినిమా రాగా, ఈ సినిమాకి పోటీగా చిరంజీవి న‌టించిన మృగ‌రాజు కూడా విడుద‌లైంది. మొద‌టిరోజు చిరంజీవి సినిమాకే క్రేజ్ ఎక్కువ ఉంది. రెండ‌వ రోజు నుంచి న‌ర‌సింహానాయుడు థియేట‌ర్ల‌లో టికెట్లు కూడా దొర‌క‌లేదు. ఇక‌ జ‌న‌వ‌రి 14, 2001న వెంక‌టేష్ దేవిపుత్రుడు సినిమా విడుద‌లైంది. మృగ‌రాజు, దేవిపుత్రుడు సినిమా డిజాస్ట‌ర్లు అయితే.. బాల‌కృష్ణ న‌టించిన న‌ర‌సింహ‌నాయుడు భార‌త‌దేశ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డు సృష్టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి.

do you know which records narasimha naidu created

127 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న న‌ర‌సింహ‌నాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డం అదే మొద‌టి సారి. ఈ అరుదైన ఘ‌న‌త బాల‌కృష్ణ‌కే ద‌క్కింది. సమర సింహా రెడ్డి తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా సమర సింహారెడ్డి లాగే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బాలయ్యతో బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన నాల్గో చిత్రం. ఈ సినిమా చాలా చోట్ల సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం విశేషం.నరసింహనాయుడు సినిమా కథను చిన్నికృష్ణ అందించారు. మహాభారతంలోని విరాట పర్వంలోని బృహన్నల పాత్రను స్పూర్తిగా తీసుకొని తెరకెక్కించినట్టు రచయత పరుచూరి బ్రదర్స్ చెప్పారు. దాదాపు భాషా, సమర సింహారెడ్డి, ఇంద్ర వంటి చాలా సినిమాలు ఇదే కథ స్పూర్తితోనే తెరకెక్కాయి.

Admin

Recent Posts