వినోదం

35 ఏళ్ల క్రితం త‌న‌పై జ‌రిగిన విష ప్ర‌యోగంపై స్పందించిన చిరు.. ఏం చెప్పారంటే..?

మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో టాలీవుడ్ టాప్ హీరోగా ఎద‌గ‌గా, ఈ త‌రం జ‌న‌రేష‌న్‌ని సైతం త‌న అభిమానులుగా మార్చుకున్నాడు చిరు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవి ఒక్కడే సినిమా రంగాన్ని ఏలుతున్నారని కొందరు అసూయపడేవారు ఉండ‌డం స‌హ‌జం. ఏ రంగంలోనైనా సరే గొప్ప గా ఎదిగిన వాళ్లపై అసూయ, ఈర్ష్య పెంచుకునే వారు కొందరు ఉంటూనే ఉంటారు. అయితే 1988వ సంవత్సరంలో చిరంజీవి పై విష ప్రయోగం జరగడానికి కూడా అసూయ, కుట్ర కారణమని కొందరు అంటుంటారు.అయితే మరణ మృదంగం సినిమా షూటింగ్ లో జరుగుతున్న సమయంలో చిరంజీవి పై విష ప్రయోగం జరిగింది. తాజాగా దానిపై స్పందించారు చిరు.

మరణమృదంగం షూటింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న గురించి మాట్లాడిన చిరంజీవి.. అప్పట్లో అభిమానులు వచ్చి డైరెక్ట్‌గా కలిసేవారు అని అన్నారు.. ఆ రోజు ఫైట్‌ షూట్‌ జరుగుతుంది. కొంతమంది అభిమానులు వచ్చారు. నాతో కేక్‌ కట్‌ చేయించారు. నేను ఎప్పుడైనా సరే.. స్పూన్‌తోనే తింటాను. చేతితో పెడితే తినను. కానీ ఆ రోజు ఓ అభిమాని.. బలవంతంగా కేక్‌ నా నోట్లో పెట్టే ప్రయత్నం చేయ‌గా, అది చేదుగా అనిపించింది. వెంటనే ఉమ్మేశాను. తర్వతా టెస్ట్‌ చేస్తే.. కేక్‌లో ఏదో పౌడర్‌ కనిపించింది’’ అని అన్నారు.

chiranjeevi responded in poison incident

వెంటనే అక్కడున్న వారు.. అతడిని పట్టుకుని నాలుగు పీకి అందులో ఏం క‌లిపావ‌ని గట్టిగా అడిగారు. అప్పుడు అత‌డు నా అభిమాన సంఘానికి అధ్యక్షుడంట. అయితే కొన్ని రోజులుగా నేను తనను పట్టించుకోవడం లేదనే కోపంతో.. కేరళ నుంచి ఏదో వశీకరణ పూజ చేసి ఏదో పొడి తెచ్చి కేక్‌లో కలిపాడట‌. అది తింటే.. నేను గతంలో మాదిరే.. తనతో మాట్లాడతాను న‌మ్మి ఆ పొడి క‌లిపాడు. అయితే అది విష ప్రయోగం కాదు’’ అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

Admin

Recent Posts