వినోదం

విజ‌య‌శాంతి, రాధ మ‌ధ్య అప్ప‌ట్లో కోల్డ్ వార్ జ‌రిగేదా.. ఎందుకు..?

టాలీవుడ్ లో మూడున్నర దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన వారిలో విజయశాంతి, రాధ త‌ప్ప‌క ఉంటారు.వీరిద్దరూ అప్పటి స్టార్ హీరోలతో పోటీపడి మరి నటించేవారు. విజయశాంతి నటనపరంగా టాప్ ప్లేస్ లో ఉంటే రాధ డ్యాన్సుల్లో హీరోలతో పోటీపడి మరి స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టేంది.. అలా ఇద్దరు ఒకరికొకరు పోటీపడి మరి సినిమాలు చేసేవారు. ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ చిరంజీవితో రాధా, విజయశాంతి ఎక్కువ సినిమాలు చేశారు. చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ సినిమా వచ్చిన వెంటనే.. రాధా – చిరు కాంబినేషన్లో మరో హిట్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది.

చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ తో పాటు రాధా – చిరంజీవి కాంబినేషన్ సినిమాలు కూడా అలాగే ఎంజాయ్ చేసేవారు ప్రేక్ష‌కులు. చిరంజీవితో విజయశాంతి, రాధ ఇద్దరు సూపర్ హిట్ సినిమాలు ఇస్తుండడంతో దర్శక, నిర్మాతలు సైతం చిరంజీవితో సినిమా తీసేటప్పుడు.. ఈ ఇద్దరు హీరోయిన్ల డేట్ ల కోసం వెంటపడేవారట. ఇక వీరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి అంటే చాలు పక్కా హిట్ అని నిర్మాతలు కూడా నమ్మేవారు.అందుకే ఇక వీరి కాంబినేషన్ ఎన్నోసార్లు రిపీట్ అయింది అని చెప్పాలి. అయితే ఇలా స్టార్ హీరోయిన్లు గా కొనసాగిన విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్ వార్ జరిగేదట.

what happened between vijaya shanti and radha

ముఖ్యంగా చిరంజీవి సినిమాల విషయంలో విజయశాంతి, రాధ మధ్య అసలు మాటలు కూడా ఉండేవి కాదట. చిరంజీవి సినిమాల విష‌యంలో ఒక్కోసారి విజయశాంతి డేట్లు ఖాళీ లేకపోతే రాధను హీరోయిన్‌గా తీసుకోవడం… రాధ‌ బిజీగా ఉంటే విజయశాంతిని తీసుకోవటం జరిగేదట. ఈ క్రమంలోనే విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్‌వార్ కూడా జరిగేదని టాక్. విచిత్రం ఏంటంటే చిరుకు జోడిగా ఈ ఇద్దరు కలిసి కూడా సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే కాల‌క్రమంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సూపర్ హిట్ కొ్ట‌డంతో అనంత‌రం టాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ గా కూడా మారింది.

Admin

Recent Posts