వినోదం

Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ షాడో ప‌ర్సన్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చర్య‌పోతారు..!

Attarintiki Daredi : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో అత్తారింటికి దారేది ఒక‌టి. ఈ సినిమా టీవీలో ఎన్ని సార్లు వ‌చ్చిన కూడా చాలా ఆస‌క్తిగా చూస్తుంటారు. జల్సా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను వసూలు చేసిఅంద‌రికి షాక్ ఇచ్చింది ఈ చిత్రం. అయితే ఈ బ్లాక్ బస్టర్ లో సినిమాని త్రివిక్రమ్ ముందుగా పవన్ కళ్యాణ్ కోసం అనుకోలేదట.

ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు బావుంటాడని ఆయన కోసం ఈ కథను సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రమ్. కానీ అప్పట్లో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన పూర్తి డేట్స్ ని త్రివిక్రమ్ సినిమా కోసం కేటాయించార‌ట‌. దీంతో ఆ సమయంలో త్రివిక్రమ్ దగ్గర అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్ట్ ఉండడంతో పవన్ కళ్యాణ్ తోనే ఈ సినిమా చేశాడు త్రివిక్రమ్. బాహుబలి సినిమా వచ్చేంతవరకు అత్తారింటికి దారేది సినిమా రికార్డ్స్ ని ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేదు . ఈ చిత్రం సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు.

do you know who is this shadow person in attarintiki daredi movie

అయితే ఈ సినిమాలో ఎవ్వరూ గమనించని కొన్ని చిన్న చిన్న షాట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సినిమా క్లైమాక్స్ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకుల హృదయాలను ఎంత‌గానో కదిలిచింది.. పవర్ స్టార్ లాంటి హీరో తో ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ ని ప్లాన్ చెయ్యడం అంటే , త్రివిక్రమ్ శ్రీనివాస్ సాహసానికి మెచ్చుకోవచ్చు.అయితే ఈ క్లైమాక్స్ సన్నివేశం లో నదియా పవన్ కళ్యాణ్ తో ‘ఫోన్ చెయ్ రా గౌతమ్’ అనే షాట్ ఉంటుంది. అప్పుడు ఆమె వెనుక చివర్లో ఒక వ్యక్తి నిలబడి ఉంటారు. అయితే ప‌వన్ క‌ళ్యాణ్ కాదు, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆరోజు షూటింగ్ ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు షూటింగ్ కి వచ్చాడట. ఆ సమయం లో షాట్ జరుగుతుండగా ఆయన సెట్స్ బయట నిల్చొని ఫోన్ మాట్లాడుతుంటే ఫ్రేమ్ లోకి తెలియ‌కుండా వ‌చ్చేశాడు. ఈ విష‌యం త్రివిక్ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Admin

Recent Posts