వినోదం

RRR : ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

RRR : దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులతో పాటు.. సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తారు. రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికినా చాలు అనుకుంటారు. అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే ? ఎవరైనా ఎగిరి గంతేస్తారు. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ఇదే కోరుకుంటారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో జక్కన్న తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిన విషయమే. అయితే వీరికంటే ముందు రాజమౌళి పలువురు స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వలన వారు ఆర్ఆర్ఆర్ సినిమాను రిజెక్ట్ చేశారట. మరీ ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

do you know who missed to do rrr movie

సీత పాత్ర కోసం మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను జక్కన్న సంప్రదించగా.. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారని టాక్. ఆ తర్వాత పరిణీతి చోప్రాను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో.. ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. చివరికి సీత పాత్రలో ఆలియా భట్ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

మరోవైపు ఎన్టీఆర్‌కు జోడీగా మొదటగా అమీ జాక్సన్‌ను జక్కన్న సంప్రదించార‌ట‌. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్ కైఫ్‌ను కూడా సంప్రదించగా.. ఆమె కూడా అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను తీసుకోవడం జరిగింది. అనూహ్యంగా షూట్ మొదలైన కొద్ది రోజులకే ఆమె కూడా తప్పుకుంది. దీనితో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కింది. ఎన్టీఆర్ కు జోడీగా మోరిస్ సెట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.

Admin

Recent Posts