Bahubali : దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదలైన విషయం విదితమే. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2 : ది కన్‌క్లూషన్.. పేరిట ఈ మూవీ రెండు భాగాలుగా వచ్చి ప్రేక్షకులను అలరించింది. అయితే ఇందులో ఒక చిన్న విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ప్రేక్షకులు గమనించలేదు. అదేమిటంటే..
మొదటి పార్ట్ సినిమాలో శివుడు (మహేంద్ర బాహుబలి), అవంతికల ఒక ప్రదేశంలో సరదాగా గడుపుతారు. అక్కడే సాంగ్ కూడా ఉంటుంది. అయితే ఆ ప్రదేశం ఏంటో తెలుసా ? దేవసేన రాజ్యం.. కుంతల.. భల్లాల దేవుడు ఆ రాజ్యంపై దండెత్తి దాన్ని సర్వ నాశనం చేస్తాడు. దీంతో ఆ రాజ్యం తాలూకు శిథిలాలు మిగులుతాయి. అవంతికతో శివుడు అక్కడే ప్రేమాయణం నడిపిస్తాడు. అవంతిక బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ శిథిలాలను మనం స్పష్టంగా చూడవచ్చు.
కుంతల రాజ్యం మొత్తం తెల్లని రాయిపై నిర్మాణమై ఉంటుంది. కనుక వాటిని సులభంగా గుర్తు పట్టవచ్చు. బాహుబలి రెండో పార్ట్‌లో దేవసేన రాజ్యాన్ని మనం చాలా క్లియర్‌గా చూడవచ్చు. అదే రాజ్యం భల్లాల దేవుడి వల్ల నాశనం అయ్యాక శిథిలావస్థకు చేరుకుంటుంది. అక్కడే అవంతిక, శివుడు ప్రేమలో సరదాగా గడుపుతారు. కుంతల రాజ్యం మొత్తాన్ని తెల్లని మార్బుల్ రాయితో నిర్మించారు. అది చాలా అందంగా ఉంటుంది. దాన్ని నాశనం చేయకముందు.. చేసిన తరువాత స్పష్టంగా మనం చూడవచ్చు. కానీ ఈ విషయాన్ని చాలా మంది ఇప్పటి వరకు గమనించలేదు. ఇక రెండు ఫొటోల్లోనూ హంసలకు చెందిన చిన్న విగ్రహాలు ఉంటాయి. ఇవి కుంతల రాజ్యానికి చిహ్నాలు. వాటిని కూడా స్పష్టంగా చూడవచ్చు. అంటే మనకు బాహుబలి మొదటి పార్ట్‌లోనే కుంతల రాజ్యం కనిపించిందన్నమాట..!