వినోదం

బ్రహ్మానందం రెండో కొడుకు హీరో లుక్కుకు ఏమాత్రం తీసిపోరు.. మీరు ఓ లుక్కేయండి..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పాత్ర లేని సినిమా అంటూ ఉండదు. కానీ గత ఐదు సంవత్సరాల క్రితం ఏ సినిమాలోనైనా ఈయన కామెడీ లేకుండా సినిమానే వచ్చేది కాదు. చాలామంది దర్శక నిర్మాతలు కూడా తప్పక ఆయన కామెడీ కావాలని డేట్స్ కోసం వేచి చూసి మరీ సినిమాల్లో పెట్టుకునేవారు. తెలుగు ఇండస్ట్రీలో అంతటి స్టార్ కమెడియన్ ఎవరో మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది. ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. ఆయన పేరులోనే ఉంది ఆనందం..

ముఖ కదలికలతోనే కామెడీని చూపించే శక్తి ఉన్న స్టార్ కమెడియన్ ఆయన. అలాంటి స్టార్ కమెడియన్ కుటుంబం విషయానికి వస్తే ఆయన పెద్ద కొడుకు ఇప్పటికే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ పరిచయమయ్యారు. కానీ బ్రహ్మానందం చిన్న కొడుకు ఎవరు ఇప్పటి వరకు తెలియదు. మరి ఆయన గురించి ఓ సారి చూద్దాం.. బ్రహ్మానందం గారు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ లలో ఒకరు.1000 పైగా చిత్రాల్లో నటించి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

have you seen brahmanandam second son

కానీ ఈ మధ్య కాలంలోనే అనారోగ్యం కారణంగా అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఆయన సోషల్ మీడియాలో మిమ్స్ రూపంలో రోజు కనిపిస్తూనే ఉంటారు. బ్రహ్మానందం కు ఇద్దరు అబ్బాయిలు పెద్దబ్బాయి పేరు రాజా గౌతం, చిన్నబ్బాయి పేరు సిద్ధార్థ్. ఆయన ఎవరికీ పరిచయం లేదు బయట కూడా ఎప్పుడు కనిపించింది లేదు. కానీ రీసెంట్ గా తన బ్రదర్ మరియు వాళ్ళ అమ్మగారు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు సిద్ధార్థ్. ఆ ఫోటోని రాజా గౌతం రీ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Admin

Recent Posts