చాలా ఏళ్ళ కిందట ANR ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు .. ఇది 1940s లో సంగతి ఆ ఇంటర్వ్యూ లో అప్పట్లో ఇండస్ట్రీ మనుషులు ఆర్టిస్టులను ఎలా సంబోధించేవారు అని చెపుతూ ఒక ఉదాహరణ చెప్పారు. నాకు అప్పటి దర్శకుడి పేరు గుర్తుకు లేదు .. ఆయన ANRను లో మధ్యలో మధ్యలో .. లం** కొడకా అని నవ్వుకుంటూ తిడుతూ ఉండేవారట .. ఆ దర్శకుడు చాలా సీనియర్ అవ్వడం చేత, వయసులో కూడా పెద్ద వాడు అవ్వడం చేత ANR కి ఒళ్ళు మండిన కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి .. అప్పటికి ANR ఇంకా చిన్న నటుడే అవ్వడం వలన కూడా కామ్ గా ఉండేవారట .. పైగా ఆ రోజుల్లో నెల జీతం వారీగా ANR కి పారితోషికాలు ఉండేవి .. ఏదన్నా సినిమా చేస్తే మళ్లీ దానికి ప్రత్యేకంగా కొంత ఇచ్చేవారు .. ఆకాస్త అహంకారాలు పోతే హీరో వేషం పోతుంది అని భయం.
ఆ పెద్ద డైరెక్టర్ మాటల మధ్యలో ప్రతి సారి ఆ మాట అంటూ ఉంటె ANR మనసు చివుక్కుమనేది.. చివరికి ANR బాలరాజు చిత్రం లో మంచి బ్రేక్ వచ్చింది .. ఆ సినిమా అయ్యాక ఆ దర్శకుడు మళ్లీ వచ్చి మనం సినిమా చేయాలి రా అబ్బాయి అంటే .. ANR ఈ సారి కొంచం ధైర్యం చేసి ఆయనతో వెంటనే .. నాకు సినిమా చేయడం లో ఏ అభ్యన్తరం లేదు .. కాకపోతే ఒక్క విషయం నన్ను మీరు లం***** అని మటుకు పిలవడానికి వీలు లేదు అని చెప్పారు .. ఆ దర్శకుడు ఆశ్చర్య పోయి .. భలే వాడివి రా .. సరే పిలవను లే అని అన్నారు.. ఆ రోజుల్లో నటి నటులు అంటే చాలా చులకన భావన ఉండేది ,.. భానుమతికి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయి .. ఇలా ఆ తరం వారు అవస్థలు పడేవారు..
ఆ రోజుల్లో హెచ్. యం. రెడ్డి, కే. వీ. రెడ్డి, ఆదుర్తి సుబ్బా రావు లాంటి ఆ తరం దర్శకులు తరవాత వచ్చిన వారికి ANR, ఎన్టీఆర్ లాంటి వారు సీనియర్స్ అయ్యారు. ఆ తరువాత వారి టైం వచ్చింది .. ఇప్పుడు కొత్తగా వచ్చిన దర్శకులకు నటులైన ANR, ఎన్టీఆర్ సీనియర్స్ .. ఇప్పుడు గౌరవాలు అందుకోవడం వారి వంతు అయింది .. అలాంటి వారు సర్ అని సంబోంధించలేక బాబు అని అయ్యా అని పిలిచిన వారు ఉన్నారు. 1970 – 1980 లో హరికృష్ణ, బాలకృష్ణ సినిమాల్లో బాల నటుల పాత్రలు చేయడం మొదలుపెట్టారు … ఆ తరం దర్శకులు వారిని ప్రేమగా బాబు అని పిలిచేవారు , వారిని ఏదో పిల్లల్ని చూసినట్టు చూసేవారు .. కాట్రగడ్డ ప్రసాద్ లాంటి నిర్మాతలు అయితే బాలకృష్ణ ని సింపుల్ గా బాలయ్య అనే పిలిచేవారు ..
కానీ కొందరు ప్రేమతో బాబు అని పిలవడం వలన చిన్నగా అది ఒక ఫార్మాలిటీ అయింది .. 1986 లో నాగార్జున వచ్చేసరికి .. అతన్ని అందరు చిన్న బాబు అని పిలిచేవారు, వాళ్ళ అన్నయ వెంకట్ పెద్ద బాబు .. నాగార్జున చిన్న బాబు అని ఒక సినిమా కూడా వచ్చింది… ఆ సంస్కృతి చిన్నగా కృష్ణ కొడుకు అయిన రమేష్ బాబుకి కూడా పాకింది, ఆ తరువాత వచ్చిన జగపతి బాబు కూడా బాబు అయిపోయాడు .. ఆ తరువాత వచ్చిన మహేష్ కి కూడా బాబు తగిలించారు .. మహేష్ బాబు కూడా ఈ బాబు పదానికి బాగా విసిగిపోయాయి తన పేరు మహేష్ అని క్రెడిట్స్ లో వేయించుకోడానికి ఇష్టపడతాడు.
ఈ పిచ్చి ఎంత పరాకాష్టకు చేరింది అంటే .. ఒక బచ్చా హీరో, బాక్గ్రౌండ్ లేని హీరో కూడా ఒక హిట్ కొట్టంగనే .. వాడిని ఆకట్టుకోవడం కోసం కొత్త దర్శకులు లేదా అప్పుడప్పుడే వచ్చిన దర్శకులు వాళ్ళని కూడా బాబు అని పిలవడం మొదలుపెడుతున్నారు. అందుకే కృష్ణ వంశి ఖడ్గం సినిమా లో సెటైరికల్ గా బాబు కాన్సెప్ట్ మీద సినిమా తీశారు… ఒక సారి ఏదో సినిమా చేస్తుంటే ఒక హీరో సెక్రటరి ఫోన్ చేసి బాబు మాట్లాడుతారట అని కృష్ణ వంశి తో అన్నాడు .. కృష్ణ వంశి కి కాసేపు అర్ధం కాలేదు .. ఏ బాబు అని .. అంతగా ఈ బాబు కల్చర్ పాతుకుపోయింది .. చిన్నగా ఈ బాబు కల్చర్ నుంచి బయటకు రావాలి అని హీరోలకు ఉన్న కూడా .. ఇప్పడికే బాబు అని పిలవడానికి అలవాటు పడిపోయిన జనాలు అందరూ మానుతారా లేదా అనడం సందేహమే .. అట్లా అని .. హీరోలను పేరు పెట్టి పిలిచే అంత సాహసం ఎవరు చేయగలరు ??? ఎవరి జాబ్ సెక్యూరిటీ వాళ్ళకి ముఖ్యము..
ఇదంతా ఒకే.. మరి ఇప్పటి దాకా బాబు అని పిలిచారు .. ఇప్పుడు కొత్తగా మంచు లక్ష్మి, రాజశేఖర్ కూతుళ్ల లాంటి వారి హీరోయిన్లుగా వస్తున్నారు వారిని ఏమని సంబోధిస్తారు ? పాపా అనా ?