అన్నీ పని చేస్తాయి. సౌర పలకల జీవితకాలం 25 – 30 సంవత్సరాలు సగటు 20 సం అనుకుందాం. 15 యూనిట్లు ప్రతి రోజు ఉత్పత్తి చెయ్యాలి అనుకుంటే ఒక్క సారి పెట్టుబడి 4 లక్షలు. కేంద్రం, రాష్ట్రం రాయితీలు ఇస్తున్నాయి. ఇంచుమించు 2 లక్షలు రాయితీ రావచ్చు. సౌర విద్యుత్తు వినియోగం గృహ అవసరాలకి 3 పద్ధతులు ఉన్నాయి. Off grid, On grid, Hybrid.
Off grid – ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. విద్యుత్ శాఖతో సంబంధం, అనుసంధానం లేకుండా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. అయితే, మీ అవసరాలకు తగ్గ మోతాదులో విద్యుత్ సరఫరా కోసం సౌర పలకల్ని మాత్రమే కాదు నిల్వ ఉంచుకోవడానికి కూడా పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. సగటు వ్యక్తికి అంత ఉపయుక్తం కాదు.
On grid – సాధారణ విద్యుత్ లైన్లు అలానే ఉంటాయి సౌర శక్తి అనుసంధానం అవుతుంది. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్తు ని ఉపకరణాలు ముందుగా ఉపయోగించుకుని ఆ తరువాత అవసరమైతే సాధారణ విద్యుత్ ఉపయోగించుకుంటాయి. బ్యాటరీ/నిల్వ కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టరు. బ్యాకప్ లేకపోతే, రాత్రులు సాధారణ విద్యుత్తుని ఉపయోగించుకుంటాయి. వాడని సౌరవిద్యుత్తు, విద్యుత్తు గ్రిడ్ కి వెళ్తాయి. మనకి బిల్లులో రాయితీ వస్తుంది. హైబ్రిడ్ – సోలార్ పవర్, సాధారణ విద్యుత్తు, బ్యాకప్ కలిపి ఉంటాయి.