వినోదం

Balakrishna Wife : బాల‌య్య స‌తీమ‌ణి వసుంధ‌ర తండ్రి ఎవ‌రు, ఆయ‌న ఏం చేస్తుంటారంటే..?

Balakrishna Wife : తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్క‌ర్లేదు. తండ్రి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు అన్నమాటే కానీ… తనదైన నటనతో అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు.నందమూరి బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో వివాహం అతిరథ మహారాజుల సమక్షంలో జరిగింది. వసుంధర శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు కుమార్తె. అంటే ఆమె కూడా పెద్దింట్లోనే పుట్టి పెరిగారు. బాలయ్య వివాహం చేసుకున్న తర్వాత ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని. అలాగే ఒక కుమారుడు మోక్షజ్ఞ తేజ జన్మించారు. వందల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన వసుంధర పెళ్లి తర్వాత ఇంటి పట్టునే ఉంటూ సినిమాల్లో బిజీ అయిన తన భర్త పాత్ర కూడా తానే పోషిస్తూ కుటుంబ వ్యవహారాలు చూసుకున్నారు.

భర్తకు అన్నివేళలా చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని ఒక్కరి మార్క్ కూడా లేకుండా పెంచి పెద్ద చేశారు. ఇద్దరు కుమార్తెలకు బెస్ట్ సంబంధాలు తీసుకొచ్చి వివాహం కూడా జరిపించారు.. కుమారుడిని సినీ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య భార్య వసుంధర గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య భార్య వసుంధరది గోల్డెన్ హ్యాండ్ అని అంటున్నారు. అంటే ఆమె చేత్తో ఎవరికైన డబ్బులు ఇస్తే బాగా కలిసి వస్తుందన్న ఓ సెంటిమెంట్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

interesting facts about balakrishna wife vasundhara

వసుంధర దేవి ఎవరు అంటే శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు గారి అమ్మాయి.స్వతహాగా వందల కోట్ల ఆస్తికి వారసురాలు ఆవిడ.వసుంధర గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బాలకృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు.అయితే ఒక సరదా సంఘటన ఏం జరిగిందంటే కాకినాడలో బాలకృష్ణ నటించిన రామ్ రహీం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ లో భాగంగా బాలకృష్ణ రిక్షా తొక్కే ఒక సీన్ తీస్తున్నప్పుడు వసుంధర వాళ్ళ అమ్మ బాలకృష్ణ ను చూసి అది షూటింగ్ అని తెలియక ఆశ్చర్యపోయి ఎన్టీఆర్ గారి కొడుకైన బాలకృష్ణ ఇలా రిక్షా తొక్కుతున్నారు ఏంటి అని చాలా బాధపడింది అంట ఆ విషయం బాలకృష్ణకి వసుంధర తో పెళ్లి జరిగిన తర్వాత వసుంధర వాళ్ళ అమ్మ బాలకృష్ణ తో చెప్పిందట.

Admin