వినోదం

Chiranjeevi : చిరంజీవి ఇచ్చిన ఐడియాతో కథ సిద్దం చేసిన రైట‌ర్.. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్స్ అందించి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందించారు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు చిరు. అయితే చిరంజీవి డ్యూయ‌ల్ రోల్ లో కూడా న‌టించి మెప్పించారు. ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు చిరు కెరీర్ కి నిచ్చెనగా మారాయి. అలాంటి వాటిలో ఒకటి చిరు నటించిన “రౌడీ అల్లుడు” మూవీ ఒక‌టి కాగా, ఈ సినిమా 1991 అక్టోబర్‌ 18న విడుదలై అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.

ఇందులో చిరు రెండు పాత్రలను పోషించారు. కోట్లకు పడగెత్తిన మేనల్లుడు కల్యాణ్‌ పాత్ర ఒకటి కాగా, ఆటో జానీగా మరో పాత్రలో చిరు తన నట విశ్వ రూపాన్ని చూపించారు. ఇందులో దివ్య భారతి, శోభనలు హీరోయిన్లు గా న‌టించారు.. అయితే ఈ సినిమా వెనుక ఒక చిత్రమైన సంఘటన జరిగిందట. గ్యాంగ్ లీడర్ వంటి బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న చిరు రౌడీ అల్లుడు సినిమా కథను విన్నారట. అయితే మొదట ఇందులో ఒకటే పాత్ర…చిరు ఈ సినిమాలో ఇంకేదో కావాలి, డబుల్ రోల్ ట్రీట్ ఇస్తే బాగుంటుంది అని ఐడియా ఇవ్వ‌డంతో ఇందులో మరో పాత్రను జొప్పించి మళ్ళీ చిరుకి వినిపించగా అప్పుడు మెగాస్టార్ హ్యాపీ అయ్యి ఒకే అన్నారట.

jagadeka veerudu athiloka sundari story facts

ఇక చిరంజీవి న‌టించిన మ‌రో చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’… మెగాస్టార్ చిరంజీవి జగదేకవీరుడిగా.. దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవకన్యగా శ్రీదేవి అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశారు. ఈ చిత్రం లైన్ ముందు వేరేగా చెప్పారు రచయిత చక్రవర్తి. ఆయన చెప్పిన కథ ప్రకారం.. గాయాలైన చిన్నారికి వైద్యం చేయించాలంటే లక్షలు ఖర్చవుతాయి. అప్పుడు ఓ ప్రకటన చూసి హీరో చిరంజీవి స్పేస్‌షిప్‌లోకి వెళ్తాడు. అక్కడ విహారానికి వచ్చిన శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుంటుంది. అది చిరంజీవికి దొరకడంతో దాన్ని వెదుక్కుంటూ శ్రీదేవి భూమ్మీదకు వస్తుంది. ఇది కథ. అయితే ఇది విన్న రాఘవేంద్రరావుగారు పెదవి విరిచారు. ‘మానస సరోవరం’ అయితే ఎలా ఉంటుంది అని తన బుర్రలో వచ్చిన ఓ మెరుపులాంటి ఆలోచనను రాఘవేంద్రరావుగారి చెవిన వేశారు మెగాస్టార్. అంతే కథ మొత్తం మారిపోయింది. రాఘవేంద్రరావుగారికి తెగ నచ్చేయడంతో వెంటనే ఓకే చేశారు.

Admin

Recent Posts