హెల్త్ టిప్స్

Cumin Water : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. గ్యాస్ అస‌లు ఉండ‌దు.. ఆక‌లి పెరుగుతుంది..!

Cumin Water : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు 40 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే గ్యాస్ స‌మ‌స్య వ‌చ్చేది. అరుగుద‌ల శ‌క్తి త‌గ్గ‌డం వ‌ల్ల గ్యాస్ వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం చిన్నారులకు కూడా గ్యాస్ వ‌స్తోంది. దీంతో వారు అపాన వాయువును వెనుక నుంచి విడిచిపెడుతున్నారు కూడా. అయితే గ్యాస్ స‌మ‌స్య‌ను త‌గ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే గ్యాస్‌ను త‌రిమికొట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మనలో చాలా మందికి మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు, మోతాదుకి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు, తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఇంగ్లిష్ మందులు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం ల‌భిస్తుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే గ్యాస్ సమస్య తగ్గడ‌మే కాకుండా వేసవిలో వచ్చే నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి కూడా తగ్గుతాయి. ఈ డ్రింక్ ను తయారుచేయడం కూడా చాలా సుల‌భం. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి.

many wonderful health benefits of cumin water

జీలకర్ర వేగాక ఒక గ్లాసు నీటిని పోసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన జీలకర్ర నీటిని గ్లాసులోకి వడకట్టి దానిలో చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ పటికబెల్లం పొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా తాగాలి. ఇలా రోజుకు ఒక‌సారి తాగాల్సి ఉంటుంది. దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తాగితే ఇంకా మంచిది. ఇలా తాగ‌డం వ‌ల్ల గ్యాస్ మొత్తం పోతుంది. అలాగే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు. ఆక‌లి కూడా పెరుగుతుంది. క‌నుక ఇక‌పై గ్యాస్ వ‌స్తే అన‌వ‌స‌రంగా ఖంగారు ప‌డి ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడ‌కండి. వంటింట్లో ఉండే జీల‌క‌ర్ర‌తోనే గ్యాస్‌ను త‌గ్గించుకోండి.

Admin

Recent Posts