వినోదం

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న బుడ్డోడికి అభిమానులు కాదు భ‌క్తులు ఉన్నారు..!

సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే త‌మ హీరో చిన్న‌ప్ప‌టి పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో చిన్న‌ప్ప‌టి పిక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఆ పిక్ అభిమానుల‌ని సైతం తెగ ఆక‌ట్ట‌కుంటుంది. ఇంతకు ఆ బుడ్డోడు ఎవ‌ర‌నేదే క‌దా మీ డౌట్.. అతను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. చైల్డ్ యాక్టర్ గా కనిపించిన జూనియ‌ర్ 2001 లో తెలుగు సినిమా పరిశ్రమ లోకి హీరో గా అడుగు పెట్టాడు.మొదటి సినిమా తో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయిన ఇత‌ను తన 18వ సంవత్సరం లోనే అప్పటి స్టార్ హీరో ల కి పోటీ గా నిలబడి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివతో దేవ‌ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాను రిరిలీజ్ చేశారు. అయితే థియేటర్ల వద్ద తారక్ ఫ్యాన్స్ కొన్నిచోట్ల అత్యుత్సాహం చూపించారు. థియేటర్ వెలుపల ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ బ్యానర్‌లపై అభిమానులు రెండు మేకలను చంపి, వాటి రక్తాన్ని దేవర పోస్టర్ పై చిందించారు. కాగా, మే 20న జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు జరుపుకున్నారు.

jr ntr childhood photo viral

.నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరో లు వచ్చిన ఒక్క బాలకృష్ణ, జూనియ‌ర్ ఎన్టీఆర్ మినహా మిగిన వారు ఎవరు సక్సెస్ కాలేదు. నంద‌మూరి లెగ‌సీని జూనియ‌ర్ ముందుకు తీసుకు వెళుతున్నాడు. ప్ర‌స్తుతం దేవర 2 సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్32 ,బాలీవుడ్ లో హ్రితిక్ తో వార్ 2 లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఈ సినిమాల‌తో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయంగా క‌నిపిస్తుంది.

Admin

Recent Posts