MS Narayana : తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఎంఎస్ నారాయణ. రచయితగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తాగుబోతు పాత్రలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. కెరియర్ బాగా సాగుతున్న సమయంలోనే ఎమ్మెస్ నారాయణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.2015 సంవత్సరంలో ఆయన కన్నుమూసారు. మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎమ్మెస్ నారాయణ 23 సంవత్సరాల లోపు దాదాపుగా 750 కు పైగా సినిమాలలోనటించి మెప్పించారు. ఎమ్మెస్ నారాయణ గారు చనిపోయే ముందు వరకు కూడా కామెడీ పరంగా మంచి డిమాండ్ ఉన్న కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు.
ఎంఎస్ నారాయణ ఒక్కో ఏడాదికి 30కు పైగా సినిమాలలో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఎమ్మెస్ నారాయణ చనిపోయే ఏడాదిలోపే దాదాపుగా 11 సినిమాలు విడుదలయ్యాయంటే ఆయన క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు… ముఖ్యంగా ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా నటించిన పాత్రలలో తాగుబోతు క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఆయన బ్రతికి ఉన్న రోజులలో ఎన్నో ఇంటర్వ్యూలో ఇచ్చిన ఇదే అంశం గురించి అడగగా ఆయన అందుకు సమాధానం చెబుతూ అప్పట్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నాగబాబు హీరోగా నటించిన రుక్మిణి చిత్రంలో నటించాను. అందులో నాగబాబుకు అసిస్టెంట్ గా తాగుబోతు లాగా కనిపిస్తాను.
అయితే అప్పటివరకు నేను తాగుబోతు పాత్రలు చేయలేదు. కాని ఆ సమయంలో నన్ను ప్రోత్సహిస్తూ ఆ పాత్రని అవలీలాగా చేయించేలా చేశారు నాగబాబు గారు.. ఆయన వల్లే నేను తాగుబోతు పాత్రలను అలవాటు చేసుకున్న.. ముఖ్యంగా తాగిన తర్వాత నేను మాట్లాడినప్పుడు మాట్లాడే యాస ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తుంది.. అందుకోసమే డైరెక్టర్లు కూడా తనకు ఎక్కువగా అలాంటి పాత్రలే రాస్తూ ఉంటారని ఎమ్మెస్ నారాయణ తెలిపారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు, ఆయన పోషించిన పాత్రలు అందరిని అలరిస్తూనే ఉంటాయి. ఆయన ఒక గొప్ప రచయిత మరియు డైరెక్టర్ కూడా.