వినోదం

ఎన్‌టీఆర్ దేవ‌ర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

ఎన్‌టీఆర్‌, జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన దేవ‌ర మూవీ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు గాను ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.200 కోట్ల మేర జ‌రిగిన‌ట్లు అంచ‌నా. దీంతో భారీ ఓపెనింగ్స్ ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే దేవ‌ర సినిమా ఎలా ఉంది, ఎన్‌టీఆర్ యాక్టింగ్ ఎలా చేశాడు, సినిమా స్టోరీ ఏంటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్‌టీఆర్ యాక్ట్ చేసిన దేవ‌ర మూవీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో ఎన్‌టీఆర్ యాక్టింగ్ ఇర‌గ‌దీశాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీలో ఆయ‌న యాక్ష‌న్‌, డ్యాన్స్‌, ఫైట్స్ అన్నీ బాగున్నాయి. ఇక స్టోరీ ఏంటంటే.. దేవ‌ర త‌మ చుట్టు పక్క‌ల గ్రామాల‌కు చెందిన కొంద‌రితో స‌ముద్రంపై ప‌డ‌వ‌ల్లో స‌రుకును అక్ర‌మ ర‌వాణా చేస్తుంటారు. అయితే తాము త‌ప్పు చేశామ‌ని తెలుసుకుని రియ‌లైజ్ అయి దేవ‌ర ఇక ఆ ప‌నిచేయ‌వ‌ద్దంటాడు. కానీ కొంద‌రు అత‌నికి ఎదురు తిరుగుతారు. ఇక దేవ‌ర వాళ్ల‌ను ఎలా ఎదుర్కొన్నాడు, చివ‌రికి ఏమ‌వుతుంది అనేది స్టోరీ.

jr ntr devara movie review in telugu

ఈ మూవీలో ఫైట్స్, సినిమాటోగ్ర‌ఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. కాబ‌ట్టి మిస్ అవ‌కుండా చూడండి. సినిమా మొద‌ట్లో సాగీత‌త అనిపించినా క‌థనం న‌డిచేకొద్దీ ఆస‌క్తి పెరుగుతుంది. త‌రువాత ఏం జ‌రుగుతుంది.. అని ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తుంటారు. తార‌క్ త‌న భుజ స్కంధాల‌పై ఈ మూవీని న‌డిపించాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక చివ‌ర్లో ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. క‌నుక క్లైమాక్స్‌ను క‌న్నార్ప‌కుండా చూడండి. అలాగే రాజ‌మౌళితో సినిమా చేసిన త‌రువాత హీరోల‌కు ఫ్లాప్ లు వ‌స్తాయి అన్న సెంటిమెంట్‌ను కూడా తార‌క్ ఈ మూవీతో బ్రేక్ చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. అంత అద్భుతంగా ఈ మూవీ ఉంది. కాబ‌ట్టి మిస్ అవ‌కుండా చూడండి. ఇదొక పైసా వ‌సూల్ మూవీ అని నిర‌భ్యంత‌రంగా చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts