వయస్సు పైబడుతున్న వారు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడంతో కీళ్ల నొప్పులు వస్తాయి. అయితే ప్రస్తుతం చాలామంది కీళ్ళ వాతంతో బాధ పడుతున్నారు. కూర్చుంటే లేవలేక, లేచినా నడవలేక ఇబ్బంది పడుతున్నారు తీసుకునే ఆహారం ద్వారా కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు రకాల పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు సమస్య దరిచేరకుండా ఉంటుందని సూచిస్తున్నారు. ద్రాక్ష, అవకాడో,స్ట్రాబెర్రీ తినాలని సూచిస్తున్నారు.. కీళ్ల వాతంతో బాధపడేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలని అంటున్నారు . మాంసాహారం కీళ్లవాతాన్ని పెంచుతుందని, కనుక మాంసాహారాన్ని బాగా తగ్గిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు దుంపకూరలు తినకూడదు అని చెబుతున్నారు. ఆలుగడ్డలు, కంద, చిలగడదుంప లాంటి దుంప కూరలు తినడం మంచిది కాదని, ఇవి నొప్పులను పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలు, పెరుగు బాగా తగ్గించాలని, పాలు, పెరుగు కీళ్ళ నొప్పులతో బాధ పడే వారి నొప్పులను మరింత పెంచుతాయని చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు బఠానీ లకు దూరంగా ఉండాలి. శనగపిండి, మైదా పిండి వంటి వాటితో తయారు చేసిన పదార్థాలను తినకుండా ఉండాలి. వీటిని తినడం వల్ల ఇవి ఆలస్యంగా జీర్ణమై, శరీరంపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
చక్కెర పదార్థాలను ఎక్కువగా తినకూడదట. ఇది చాలా టేస్టీగా ఉన్నాయి అని ఎక్కువగా తింటే మాత్రం కీళ్ల నొప్పులు బాగా ఎక్కువ అవుతాయట. చాక్లెట్, సోడా, మిఠాయి, జ్యూస్ లు, స్వీట్ డ్రింక్స్, కొన్ని సాస్ లలో కూడా చక్కెర ఉంటుంది. ఇవి ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయట. కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు ఆలు గడ్డలు, చేమ గడ్డలు, కంద, చిలగడదుంప లాంటి దుంప కూరలు ఏవి తినకూడదు. ఇవి నొప్పులను మరింత పెంచి అనవసరమైన తిప్పలు తీసుకు వస్తాయి. ఇక మాంసాహారం కీళ్లవాతాన్ని మరింత పెంచుతుంది. మాంసాహారాన్ని తక్కువగా తీసుకుంటే కాస్త కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.