హెల్త్ న్యూస్

పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఇప్పుడంటే చాలా మంది డోలో వాడుతున్నారు కాని ఒకప్పుడు మాత్రం పార‌సిట‌మాల్ ఎక్కువ‌గా వాడేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి మనమే పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమల్ మాత్రల వాడకం ఎక్కువ‌గా పెరిగింది. అయితే తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ నిర్వహించిన డ్రగ్ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించలేదని పేర్కొనడం సంచలనంగా మారింది.

ఒక్క జ్వరానికి వాడే పారాసిటమల్ మాత్రమే కాకుండా కాల్షియం, విటమిన్, బీపీ, డయాబెటిస్ ట్యాబ్లెట్లు సహా మొత్తం 53 మాత్రలు ఈ క్వాలిటీ టెస్ట్‌లో అర్హత సాధించలేదని సీడీఎస్‌సీఓ స్పష్టం చేసింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పరిశీలనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నాణ్యత పరీక్షలో ఏకంగా 53 ఔషధాలు విఫలమయ్యాయి. ఈ జాబితాలో పారాసిటమాల్‌తో పాటు కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్లు, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, హైబీపీ మందులు ఉన్నాయి. ఈ మేరకు నెలవారీ ‘నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్‌క్యూ) అలర్ట్ జాబితాలో ఈ ఔషధాల పేర్లను సీడీఎస్సీవో ప్రకటించింది. రాష్ట్ర ఔషధ అధికారులు నెలవారీగా యాదృచ్ఛికంగా సేకరించే నమూనాల నుంచి ఈ నాణ్యతా పరీక్షలు చేసినట్టు వివరించింది.

if you are taking paracetamol tablets then must know this

క్వాలిటీ టెస్ట్‌లో విఫలమైన మెడిసిన్ జాబితాలో విటమిన్ బీ కాంప్లెక్, విటమిన్ సీ, విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, విటమిన్ డీ3, షెల్కాల్, యాంటీ యాసిడ్ పాన్-డీ, పారాసిటమాల్ ఐపీ 500 ఎంజీ, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హైబీపీ మెడిసిన్ టెల్మిసార్టన్‌ కూడా ఉన్నాయి. ఈ మెడిసిన్‌లను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీ బయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్‌తో పాటు మరికొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధాల జాబితాలో ఉంది.

Sam

Recent Posts