వినోదం

Viral Pic : ఈ ఫొటోలో క్యూట్‌గా క‌నిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. గుర్తు పట్టేశారా..?

Viral Pic : లాక్ డౌన్ టైం నుంచి సినీ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజున సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి. అలాగే తాజాగా ఓ హీరోయిన్స్‌కి సంబంధించిన త్రో-బ్యాక్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఆమె హీరోయిన్ గా సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ యాక్టీవ్ గా ఉంటుంది.

ఇక ఛాన్స్ దొరికినా ప్రతిసారీ అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా సెటిలైపోయిన కేతికా శర్మ. ఢిల్లీలో పుట్టిపెరిగిన ఆమె.. చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. కేతిక శర్మ హీరోయిన్‌గా యాక్ట్ చేయకముందే ప్రేక్షకులకు తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయి సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. మొదటి చిత్రానికి ముందే మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది కేతిక.

kethik sharma childhood photo viral

ఆకాశ్ పూరీ హీరోగా చేసిన రొమాంటిక్ చిత్రంతో కేతిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. కేతిక గ్లామర్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇక ఈ సినిమా చేస్తున్న టైంలోనే నాగశౌర్య లక్ష్యలో, మెగాహీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమా చేసింది. ఇలా హీరోయిన్ గా చేసిన 3 సినిమాలు కూడా కేతికకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా సరే ఏ మాత్రం నిరుత్సాహపడకుండా గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తూ హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ రెచ్చిపోతోంది కేతిక. చూడాలి ఇక ముందైనా కేతికకు హిట్ మూవీ పడుతుందేమో.

Admin

Recent Posts