వినోదం

పాపం సావిత్రిని చివరి రోజుల్లో అంతలా అవమానించారా.. కనీసం భోజనం కూడా పెట్టకుండా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అలనాటి మేటి నటి మహానటి సావిత్రి అంటే తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు&period; అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించు కున్నారు&period; తన అందం అభినయంతోనే కాకుండా తన కళ్ళతోనే అన్ని హావాభావాలు పలికించే టాలెంట్ ఆమె సొంతం&period; ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సావిత్రిని చివరికి నా అన్న వాళ్లే నమ్మించి మోసం చేశారు&period; అంతేకాకుండా ఆమెకున్న దాన గుణం వల్ల ఉన్నదంతా దానధర్మాలు చేసి చివరికి దారుణమైన పరిస్థితి అనుభవించింది&period; చివరి రోజుల్లో దిక్కుతోచని స్థితిలో కన్ను మూసింది&period; అప్పట్లో సావిత్రికి చాలామంది సన్నిహితులు ఉండేవారట&period; దివంగత గుమ్మడి కూడా సావిత్రికి సన్నిహితంగా ఉండేవారని తెలుస్తోంది&period; ఆయన చివరి రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో సావిత్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు&period;&period; ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ &period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను సావిత్రి కి చాలా ఆత్మీయుడిని&comma; నన్ను అన్నా అంటూ పిలిచేది కానీ ఆమె చివరి రోజుల్లో పడిన కష్టాలు నా కళ్ళతో చూశాను&period; అందులో తీపి&comma; చేదు రెండు ఉన్నాయి&period; ఓ రోజు నేను అనారోగ్యం బారిన పడిన సమయంలో మంచంపై లేవలేని స్థితిలో ఉన్నాను&period; ఆ టైంలోనే సావిత్రి వచ్చి నన్ను పలకరించింది&period; నా దిండు కింద 2&comma;000 రూపాయలను పెట్టింది&period; కానీ నేను చూసుకోలేదు&period;&period; ఆ తర్వాత చూసి సావిత్రి కి ఫోన్ చేశాను&comma; ఇలా చేసావ్ ఏంటమ్మా అని అడగ్గా నేను చనిపోయే లోపు ఎవరికీ బాకీ ఉండకూడదని సావిత్రి చెప్పుకొచ్చిందట&period;&period; ఆ టైంలో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి&period;&period; అంతేకాకుండా సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో సావిత్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77922 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;savitri-1&period;jpg" alt&equals;"nobody given food to savitri in her last days " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను నటిస్తున్న ఒక సినిమాలో తల్లి పాత్రలో కూడా నటించిందని ఆయన చెప్పుకొచ్చారు&period; ఆ సినిమా షూటింగ్ టైంలో మధ్యాహ్నం అందరికీ ఇంటి నుండి క్యారియర్లు వచ్చేవి&period; రానివారికి ప్రొడక్షన్ వారు భోజనం పెట్టేవారు&period; కానీ సావిత్రికి క్యారియర్ వచ్చేది కాదు&period; ప్రొడక్షన్ వాళ్లు కూడా భోజనం పెట్టలేదు&period; ఓ దగ్గర ఖాళీగా కూర్చున్న సావిత్రిని నేను భోజనం చేయలేదా అని అడిగితే&period;&period; లేదన్నా అంటూ చెప్పింది&period;&period; దాంతో కలిసి తిందామని పిలిచాను కానీ మొదట రానంది&comma; నువ్వు రాకుంటే నేను కూడా భోజనం చేయను అని చెప్పేసాను&period;&period; దీంతో ఏడ్చుకుంటూ వచ్చి నాతో భోజనం చేసింది&period;&period; ఒకప్పుడు సావిత్రి డేట్స్ కోసం ఎదురుచూసిన వాళ్ళు ఉన్నారు&comma; కానీ చివరి రోజుల్లో మాత్రం ప్రొడక్షన్ వాళ్ళు కూడా పట్టించుకోలేదు&period; అంటూ సావిత్రికి జరిగిన అవమానాన్ని ఆయన గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts