Off Beat

భూమి వైపు వేగంగా దూసుకువ‌స్తున్న బ్లాక్ హోల్‌.. యుగాంతం త‌ప్ప‌దా..?

ఈ అనంత విశ్వంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిలో అతి పెద్ద మిస్టరీ బ్లాక్ హోల్. మనోళ్లు కృష్ణ బిలం అని అంటుంటారు. ఎంత పెద్ద గ్రహాన్నానైనా నక్షత్రాన్నైనా ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు. ఒక్కసారి ఇందులోకి ఏదైనా వెళ్లిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండ‌దు. దాని దరిదాపుల్లో ఉన్న దేనినైనా ఇది క్షణాల్లో మింగేస్తుంది. అంత శక్తివంతమైంది ఇది. అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా బ్లాక్ హోల్ తన వైపు తిప్పుకోగలదు.

ఖగోళ శాస్త్రవేత్తలు ఓ భారీ కృష్ణబిలాన్ని గ‌తంలో కనుగొన్నారు. భూమికి అత్యంత చేరువలో ఉన్న కృష్ణబిలం ఇదే. ఈ బ్లాక్ హోల్ మ‌న సౌర వ్య‌వ‌స్థ పాల‌పుంత ఉన్న బ్లాక్ హోల్ కంటే 10 రెట్లు పెద్దది. ఒఫియకస్ నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు వెల్లడైంది. ఇత‌ర పాల‌పుంత‌లో ఒక బ్లాక్‌ హోల్‌ ని గుర్తించ‌డం ఇదే మొద‌టిసారి అంటూ బ్రిటన్ కి చెందిన అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

a black hole is arriving towards earth

దీనికి గయియ బీహెచ్ 1 అని పేరు కూడా పెట్టారు. ఇంట‌ర్నేష‌న‌ల్ జెమిని అబ్జ‌ర్వేట‌రీ సాయంతో వీళ్లు దీన్ని గుర్తించారు. గ‌తంలో వాటికంటే ఈ బ్లాక్‌ హోల్ మూడు రెట్లు వేగంగా భూమివైపు దూసుకొస్తుందని వెల్లడించారు. ఒక పాల‌పుంత‌లో ఇలాంటివి చాలా వ‌ర‌కు ఉంటాయంటున్నారు అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు. అయితే.. శాస్త్రవేత్తల్లో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏంటంటే.. పాలపుంతలో నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాన్ని స్పష్టంగా గుర్తించడం ఇదే మొదటిసారి.

నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 వరకు ఉంటాయట.

Admin

Recent Posts