వినోదం

Parugu Actress Sheela : పరుగు హీరోయిన్ షీలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే..?

Parugu Actress Sheela : సీతాకోకచిలుక చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షీలా. ఈమెకు గుర్తింపు వచ్చింది మాత్రం అల్లు అర్జున్ తో కలిసి నటించిన పరుగు చిత్రంతోనే. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు హీరోయిన్లు తమ ఫిట్ నెస్ ను, బ్యూటీని మైంటైన్ చేస్తూ ఆకర్షణీయంగా ఉంటారు. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడం కారణం వలనో లేక వివాహం చేసుకోవడం వలనో సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలా సినిమా ఇండస్ట్రీకి దూరమైనవారిలో హీరోయిన్ షీలా కూడా ఒకరు. షీలా రాజు భాయ్, మస్కా, అదుర్స్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పరమవీరచక్ర చిత్రం తర్వాత షీలా మరలా తెలుగు చిత్రంలో కనిపించలేదు. ప్రస్తుతం షీలా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ లో ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూసేయండి.

షీలా తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా అవకాశాలు తగ్గడంతో షీలా తన సన్నిహితుల్లో ఒక‌ వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె కాన్సర్ వ్యాధితో పోరాడుతున్నట్లు సమాచారం కూడా వినిపించింది. అయితే కాన్సర్ తో పోరాడుతూనే షీలా కొన్ని చిత్రాలలో కూడా నటించడం జరిగిందట. ఎన్ని చిత్రాలలో నటించినా కూడా తనకు కాన్సర్ ఉన్నట్టు షీలా ఎప్పుడు కూడా బయటపెట్ట‌లేదు. షీలా ఆ తరువాత కాన్సర్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె కాన్సర్ తో పోరాడుతుందనే విషయాన్ని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

parugu actress sheela do you know how she is now

అయితే షీలా తనకు క్యాన్సర్ అనే విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఆమె మేనేజ్ చేసుకుంటుందని సమాచారం. నటన పరంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న షీలా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో సూపర్ మార్కెట్ స్టోర్ నడుపుతుందని సమాచారం. ఎవరి సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోవడం వలన ఒక్కప్పుడు హీరోయిన్ గా ఉన్న షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకొని జీవితం గడుపుతుందట. ఒకప్పటి హీరోయిన్ ఇలా సాధారణ జీవితం గడుపుతుంది అని తెలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా షీలా ఫోటోలు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త వహిస్తోంది.

Admin

Recent Posts