హెల్త్ టిప్స్

రాత్రి నిద్ర స‌మ‌యంలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. ఇలా చేయండి..!

కొంద‌రు రాత్రి స‌మ‌యంలో నిద్ర పోతున్న‌ప్పుడు కాళ్ల తిమ్మిర్ల‌తో చాలా ఇబ్బంది ప‌డుతంటారు. దీని వ‌లన వారికి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్టదు. అలానే నొప్పిని భ‌రిస్తూ ఉంటారు కొంద‌రు.అయితే ఇలా రావ‌డానికి ఎవ‌రికి వారు ఏవో ఆలోచ‌న‌లు చేస్తుంటారు. ఈరోజు బాగా తిరిగాం కదా అని కొందరు అనుకుంటే, మ‌రికొంద‌రు శరీరంలో వేడి ఎక్కువైందిలే.. అదే చిన్నగా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కాని కాళ్లు తిమ్మిర్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యలే వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. శరీరంలో తగినంత పోషకాలు లేకపోవడం, కండరాల సంబంధిత సమస్యలు, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్, దీర్ఘకాలిక వ్యాధులు.. కాళ్ల తిమ్మిర్లకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు.

అంతే కాకుండా వీటికి శరీరంలో కొన్ని విటమిన్లు లోపించడమే కారణమని స్పష్టం చేస్తున్నారు.. కొన్ని అధ్యయనాల ప్రకారం, అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువగా పనిచేసినప్పుడు కండరాలు ఒత్తిడికి లోనై అలసట ఏర్పడుతుంది. ఇది తిమ్మిరి ఏర్పడేందుకు కారణం కావచ్చు..శరీరం అలసిపోకుండా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా అవసరం. సరైన మోతాదులో నీరు తాగకపోవడం వల్ల కండరాలు సంకోచించి, తిమ్మిరి రావచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిలో కనీసం 37 శాతం మందికి రాత్రిపూట కాళ్లలో తిమ్మిర్లు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి తిమ్మిరికి మరొక కారణం ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం. ఒకే భంగిమ‌లో కూర్చోవ‌డం వ‌ల‌న రక్తప్రసరణ తగ్గి కాళ్లలో తిమ్మిర్లు రావచ్చు.

leg cramps at night follow these tips

రాత్రిపూట కాళ్ల తిమ్మిరి నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ‌గా విశ్రాంతి తీసుకోవాలి. తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు కండరాలను సాగదీయడం, తిమ్మిరి ఎక్కిన ప్రాంతంలో చేతితో మసాజ్ చేయడం, ఫోర్‌ రోలర్‌ సహాయంతో కాళ్లను నెమ్మదిగా మసాజ్ చేయడం, పాదాన్ని వంచడం, తిమ్మిరి ఎక్కిన ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కాపడం వంటివి చేయాలి. ప్రతిరోజూ నిద్రకు ముందు కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేసి నొప్పిని తగ్గించవచ్చు. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, వంటివి కండరాలకు విశ్రాంతి ఇచ్చి, తిమ్మిర్లు రాకుండా కాపాడతాయి. కొన్నిసార్లు మీరు వాడే చెప్పులు కూడా కాళ్లలో తిమ్మిర్లకు కారణం కావచ్చు. అందుకే ఈ సమస్య ఉన్నవారు చెప్పులు మార్చి చూడాలి. దీనివల్ల నొప్పి తీవ్రత నెమ్మదిగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

Sam

Recent Posts