వినోదం

పెళ్లి సందడి హీరోయిన్ రవళిగుర్తుందా ? ఇప్పుడేంతలా మారిపోయిందంటే ?

ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ రవళి మీకు గుర్తుందా..? మీరు గుర్తుపట్టే విధంగా చెప్పాలంటే 1996లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలోని హీరోయిన్ రవళి. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. రవళి ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆలీబాబా అరడజను దొంగలు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమాతో మంచి పేరును తెచ్చుకుంది రవళి.

పెళ్లి సందడి సినిమాలో మెయిన్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ కి అక్క‌గా రవళి నటించింది. 18 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించిన రవళి ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించింది. ఆ తర్వాత కాస్త లేట్ ఏజ్ లో తనకంటే వయసులో చిన్నవాడు అయిన నీలి కృష్ణ అనే వ్యక్తిని 2007 లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 2008 మే 29న ఈ దంపతులకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు రవళి వయసు 50 ఏళ్లు. అప్పట్లో రవళితో కలిసి నటించిన ఆమని, ఇంద్రజ తదితరులు ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తున్నారు. కానీ రవళి మాత్రం సినిమాలకి స్వస్తి చెప్పేసింది. అలా చాలా రోజుల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది రవళి. ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

pelli sandadi actress ravali have you seen how is she now

గ‌తంలో ఒక‌సారి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వెలుపలికి వచ్చిన రవళిని అభిమానులు తొలిత గుర్తుపట్టలేకపోయారు. అయితే కొంతమంది అలనాటి సినీ ప్రేమికులు కాస్త లేటుగా గుర్తుపట్టి పలకరించే ప్రయత్నం చేశారు. దాంతో నవ్వుతూ వారిని పలకరిస్తూ రవళి వెళ్ళిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో రవళిని చూసిన అభిమానులు ఆమె ఇలా మారిపోయిందా అని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత రవళిని ఇలా చూడడం సంతోషంగానే ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Admin

Recent Posts