తెలుగు సినీ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిదా సినిమాతో ఎంతో మంది అభిమానులను ఈమె తెలుగులో సంపాదించుకుంది. తాను తన ఒరిజినల్ అందాన్నే నమ్ముకున్నానని, మేకప్ వేసుకుని నటించబోనని తేల్చి చెప్పింది సాయిపల్లవి. ఇక ఆమె రీమేక్ సినిమాలకు కూడా దూరం. గ్లామర్‌ను ఒలకబోసే పాత్రలను అసలు చేయదు. అందుకనే సాయిపల్లవి అంటే ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే సాయిపల్లవి ఈమధ్యే అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అమరన్ సినిమా రిలీజ్ సందర్భంగా సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే అంతా సద్దుమణిగింది. కానీ ఇటీవల జరిగిన ఓ సంఘటనకు మాత్రం సాయిపల్లవి ఏడ్చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..? సాయిపల్లవిని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ మీరు మళయాళీయా అని అడిగాడట. దీంతో ఆమె కాదు, నేను తమిళ వాసిని అని బదులిచ్చిందట. అయితే అదే ప్రశ్నను మరో మళయాళీ మహిళ ఇంకో సందర్భంలో అడిగిందట. దీంతో సాయిపల్లవి దాదాపుగా ఏడ్చేసిందట. ఎందుకంటే తనను చాలా మంది మళయాళీ అని భావిస్తారని, అది తన తప్పు కాదని, అలాంటప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతుందని, అందుకనే ఏడుపు వచ్చిందని సాయి పల్లవి తెలియజేసింది.
ఇక సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ అనే మూవీలో నటిస్తోంది. మరోవైపు ఈమెకు బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. రణబీర్ కపూర్‌తో కలిసి నటించే చాన్స్ దక్కించుకుంది. హిందీలో త్వరలో తెరకెక్కనున్న రామాయణంలో ఈమె సీత పాత్రలో నటించనుంది. ఇక ఈ మూవీ ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి.