హెల్త్ టిప్స్

Ayurveda Tips : ఆయుర్వేద గ్రంథాల‌లో చెప్ప‌బ‌డిన ర‌హ‌స్య ఆరోగ్య సూక్తులు

<p style&equals;"text-align&colon; justify&semi;">Ayurveda Tips &colon; ప్రతిరోజూ ఈ ఆయుర్వేద సూత్రాలని పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు&period; ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు&period; ప్రతిరోజూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period; ఉదయం&comma; సాయంత్రం రెండు పూట‌లా కూడా ప్రతి రోజూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు&period; ప్రతిరోజూ శిరస్సు&comma; ముక్కు&comma; పాదాలకి నూనె రాసుకుంటే మంచిది&period; మలమూత్ర మార్గాలని&comma; పాదాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంట్రుకలను&comma; గోళ్ళని 15 రోజులకి మూడుసార్లు కత్తిరించుకోవాలి&period; పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చాలా ముఖ్యం&period; భయం లేకుండా ధైర్యవంతుడిగా ఉంటే జీవితంలో పైకి వస్తారు&period; ఏదీ ఆలోచిస్తూ భోజనం చేయకూడదు&period; ప్రతిరోజూ సమయానికి భోజనం చేయాలి&period; రాత్రి కానీ ఉదయం కానీ భోజనం చేయకుండా ఉండడం అసలు మంచిది కాదు&period; అజీర్తి సమస్యలు లేకుండా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59749 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ayurveda-secrets&period;jpg" alt&equals;"ayurveda secrets told in old books and talapatra " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిన్న వెంటనే మళ్ళీ తింటే కూడా ఆరోగ్యం పాడవుతుంది&period; రోజూ అన్ని రకాల రుచుల‌ను తీసుకోవాలి&period; ఎప్పుడూ ఒకే రుచి తీసుకోవడం వలన బలహీనతకి కారణమవుతుంది&period; ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక రోగాలు కలుగుతాయి&period; పాలు&comma; పెరుగు తృప్తిగా తింటే ముసలితనం త్వరగా రాదు&period; విరుద్ధ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది&period; అనేక సమస్యలు కలుగుతాయి&period; ప్రతిరోజూ ఉదయాన్నే నువ్వుల నూనెని నోట్లో వేసుకుని తెల్లని నురగ వచ్చే వరకు పుక్కిలించి ఆ తర్వాత బయటకి వదిలేయాలి&period; దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు&period; దీని వలన దంతాలు బలంగా ఉంటాయి&period; దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి తీసుకున్నప్పుడు ఆవు నెయ్యిని తీసుకోవడం శ్రేష్టం&period; పప్పు ధాన్యాలలో పెసలు చాలా ఉత్తమమైనవి&period; ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది&period; దుంపలలో అల్లం శ్రేష్టం&period; ఫలముల్లో ద్రాక్ష శ్రేష్టం&period; ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం&period; చెరుకు నుండి తయారయ్యే బెల్లం శ్రేష్టం&period; మినుములని అతిగా వాడకండి&period; మలమూత్ర వేగములని ఆపకూడదు&period; ఆహారం అరగకపోయినప్పుడు ఆహారాన్ని ద్రవ రూపంలో తీసుకుంటే మంచిది&period; విరిగిన పెరుగు మలమూత్ర మార్గములకి అడ్డు పడుతుంది&period; గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts