వినోదం

Sr NTR : ఒకే ఏడాది 7 సినిమాలు చేసిన ఎన్టీఆర్.. అన్నీ సూపర్ హిట్టే.. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..?

Sr NTR : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగాడు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యాడు. 1956లో నటసార్వభౌముడి కళావైభవం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తీసిన సినిమాల్లో చాలా హిట్ అయ్యాయి. ఇంతకీ ఆ ఏడాదిలో ఆయన చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.. తెనాలి రామకృష్ణ: మొదటగా సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో తెనాలి రామకృష్ణ సినిమాతో వచ్చారు ఎన్టీఆర్. తెలుగులో రామకృష్ణుడి గా ఏఎన్ఆర్ చేశారు. కృష్ణదేవరాయలుగా 2 భాషల్లో ఎన్టీఆర్ చేశారు. ఆ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు.

చింతామణి: రెండో సినిమాగా ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ చింతామణి. తెలుగువారికి ఎంతో ప్రీతికరమైన చింతామణి నాటకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. జయం మనదే: తెలుగు జానపదాలు అంటే ఎన్టీఆరే అన్నట్లు మరోమారు నిరూపించుకున్నారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సొంత ఊరు: ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కి మంచి విజయాన్ని ఇచ్చింది. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా లో ఎన్టీఆర్, షావుకారు జానకి ప్రధాన పాత్రలో నటించారు. ఉమా సుందరి: ఓ మహారాజు చెల్లెలైనా ఉమాసుందరిని పెళ్లాడిన ఎన్టీఆర్ ఎలాంటి కష్టాలు పడ్డాడో అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.

sr ntr did 7 movies in a year know their names

చిరంజీవులు: ఈ సినిమా ఎన్టీఆర్ కు భారీ విజయాన్ని అందించింది. ఇందులో అంధుడిగా ఎన్టీఆర్ తన పాత్రకు ప్రాణం పోశాడు. శ్రీ గౌరీ మహత్యం: కత్తియుద్ధాల్లో ఎన్టీఆర్ మరోమారు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాతో మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. పెంకి పెళ్ళాం: ఎన్టీఆర్ తన భార్యతో ఎలాంటి పాట్లు పడ్డాడో.. అలాగే చివరికి ఆమెలో ఎలా మార్పు తెచ్చాడు అనేది ఆకట్టుకుంటుంది. చరణదాసి: ఇందులో ఎన్టీఆర్ తో పాటు ఏఎన్ఆర్ కూడా నటించారు. ఈ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. ఇలా ఆ ఏడాదిలో ఎన్టీఆర్ ఒక్క ఫ్లాప్ అనేది కూడా చూడకుండా 7 హిట్లు అందుకొని ఇండస్ట్రీకి కాసుల వర్షం కురిపించారు.

Admin

Recent Posts