హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపేసింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కాని విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజ, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, నితిన్ వంటి హీరోల సినిమాల్లో నటించింది.
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ , నితిన్ రాబిన్ హుడ్, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంతో పాటు, బాలీవుడ్‌లో కూడా ఈ భామ సత్తా చాటడానికి రెడీ అవుతోంది. తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీలీల , ఎప్పుటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేస్తుంటుంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. అందులో భాగంగా చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ఓ నెటిజన్ ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టారు. దానికి శ్రీ లీల ఉమ్ ఆ.. ఉమ్ ఆ.. ఐ లవ్ యూ (Muah Muah I LOVE YOU) అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల ఇచ్చిన రిప్లై స్క్రీన్ షాట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.