వినోదం

సుందరకాండ అపర్ణ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె ఎలా మారిపోయిందో తెలుసా..?

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో విక్టరీ వెంకటేష్ కథానాయకునిగా సుందరకాండ సినిమా వచ్చింది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. లెక్చరర్ ని ప్రేమించే ఒక అమ్మాయి కథ ఈ సినిమా. ఈ చిత్రంలో వెంకటేష్ లెక్చరర్ గా నటించారు. తమిళ్ లో సుందరకాండం పేరుతో వచ్చిన సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మీనా నటించగా.. వెంకటేష్ ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించింది. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అపర్ణ. అసలు ఎవరు ఈ అపర్ణ? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఈమెకు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎలా అవకాశం వచ్చిందో తెలుసుకుందాం.

ఈ చిత్రంలో అపర్ణ పాత్ర కోసం రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఆ అల్లరి పాత్రకు ఆమె అంతగా సూట్ కాకపోవడంతో ఓ కొత్త అమ్మాయి బాగుంటుందని వెతుకుతుండగా ఈ క్రమంలో ఆయన ఒక రోజు కేవివి సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ఓ అమ్మాయి ఆయనకు బాగా నచ్చేసింది. ఆ అమ్మాయి అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలుగుతుందని భావించిన రాఘవేంద్రరావు.. ఆమె సినిమాలలో నటిస్తుందో? లేదో? అనుకొని మౌనంగా ఉండి పోయారు. అలా పది రోజుల తర్వాత హీరోయిన్ కోసం జరుగుతున్న ఆడిషన్స్ లో ఆ అమ్మాయి కనిపించింది. దీంతో ఆమెను చూసిన రాఘవేంద్రరావు వెంటనే సెలెక్ట్ చేసేసారు. ఆ తర్వాత నువ్వు ఎవరు అని రాఘవేంద్రరావు అడగగా.. నా పేరు అపర్ణ. నేను నిర్మాత కేవీవి సత్యనారాయణ మేనకోడలు అని చెప్పింది.

sundarakanda movie fame aparna what she is doing right now

దీంతో అసిస్టెంట్ తో ఆమెను వెంటనే ఓకే చేసేయండి అని చెప్పేసారట రాఘవేంద్రరావు. ఆ సినిమాలో లెక్చరర్ ని ప్రేమించే పాత్రలో అపర్ణ అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఆమెకు చాలా సినిమాలలో హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. కానీ వాళ్ళ కుటుంబం సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో మాత్రం ఆమె నటించింది. ఆ తరువాత సినిమాలకు దూరమై 2002లో పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఇటీవల అపర్ణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అవి చూసి చాలామంది షాక్ అయ్యారు.

Admin

Recent Posts