వినోదం

రోజా నుండి నయనతార వరకు డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కు ఎన్నోసార్లు పెళ్లిళ్లు అవుతూ ఉంటాయి.. అది ఓన్లీ స్క్రీన్ పై మాత్రమే. అలా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సెల్వమణి సినీ డైరెక్టర్. రోజా న‌టి. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి పెళ్లి వరకు వెళ్లింది. తన భర్త డైరెక్షన్ లో కూడా చాలా సినిమాల్లో నటించింది రోజా. కానీ సెల్వమణి తమిళనాడుకు చెందిన డైరెక్టర్. నయనతార-విజ్ఞేశ్ శివన్.. కొన్నేళ్లుగా నయనతార విగ్నేష్ లు ప్రేమించుకున్నారు. ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత వీరిద్దరూ పెళ్లి ద్వారా ఒకటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. సుహాసిని-మణిరత్నం.. సుహాసిని మణిరత్నం ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇందులో మణిరత్నం దర్శకుడు అయితే సుహాసిని హీరోయిన్.

కుష్బూ-సుందర్‌.. కుష్బూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా కలియుగ పాండవులు సినిమాలో చేసింది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ సుందర్ ను పెళ్లి చేసుకుంది.

these actress married directors in film industry

రమ్యకృష్ణ-కృష్ణవంశీ.. హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణవంశీ ఆయన డైరెక్షన్లో హీరోయిన్ గా చంద్రలేఖ సినిమాలో చేసింది. ఆ తర్వాత ఇద్దరు ఒక్కటై పెళ్లి చేసుకున్నారు.

సూర్య కిరణ్-కళ్యాణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాగార్జున నిర్మాతగా సుమంత్ హీరోగా తెరకెక్కిన సత్యం మూవీతో మెగా ఫోన్ పట్టుకున్నారు సూర్యకిరణ్. అతను ప్రముఖ హీరోయిన్ అయిన కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు.

Admin

Recent Posts