ఆధ్యాత్మికం

దేవుడి ప్ర‌సాదాన్ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. నిర్ల‌క్ష్యం చేయ‌కండి.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అంతా ఆ భగవంతుని ప్రసాదమే&excl; &colon; దేవుడు సర్వాంతర్యామి&period; సర్వజ్ఞుడు&period; దేవుడు సర్వ సమగ్రుడు కాగా&comma; మానవుడు ఓ చిన్న భాగం మాత్రమే&period; మనమేం చేసినా అది దేవుడు అందించే శారీరిక బలం&comma; విజ్ఞానాల ద్వారానే&excl; కాబట్టి జీవితంలోని మన చర్యలు&comma; వాటి ఫలితాలన్నీ దైవం వల్ల సంప్రాప్తమైనవే&excl; అందుకే దేవునికి నైవేద్యం సమర్పించడం ద్వారా ఆయనకు మన కృతజ్ఞతలు తెలుపుకుంటాము&period; కాబట్టి అలాంటి ప్రసాదాలను నిర్లక్ష్యం చేయకూడదు&period; దేవుని ప్రసాదాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారా&quest; కుంకుమ&comma; పుష్పాలను ఇంటికి తీసుకొచ్చి&period;&period; ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారా&quest; అయితే జాగ్రత్త పడండి&period; లేదంటే ఈ ధోరణి దోషంగా మారి ఇబ్బందులకు గురిచేస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవాలయంలో భగవంతుడిని దర్శించుకుని పూజ చేయడం&period;&period; భగవంతుడి ప్రసాదంగా అర్చకుడు ఇచ్చిన కుంకుమ&comma; పుష్పం&comma; తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది&period; ఇక దేవాలయానికి వెళ్లి వస్తూ ఎదురుపడిన వాళ్లు అక్కడి ప్రసాదాన్ని ఇస్తే&comma; ఇంటికి రాగానే దానిని ఎక్కడో ఒకచోట పెట్టి మరిచిపోవడం చేస్తుంటారు&period; భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించకపోవడం&comma; ప్రసాదాన్ని పవిత్రంగా భావించకపోవడం వంటివి ఓ రకంగా ఆయనను అవమానపరచడమే అవుతుందని&comma; ఇది దోషంగా మారే ప్రమాదముందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు&period; ఇలాంటి ప్రవర్తన కారణంగా సాక్షాత్తు ఇంద్రుడే ఇబ్బందుల్లో పడినతీరు మనకి పురాణాల్లో కనిపిస్తుంది&period; ఒకసారి దుర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని వస్తూ వుండగా&comma; దేవేంద్రుడు తారసపడతాడు&period; వినయ పూర్వకంగా దేవేంద్రుడు నమస్కరించడంతో&comma; తనకి నారాయణుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా ఆయన దేవేంద్రుడికి ఇస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91683 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;prasadam-1&period;jpg" alt&equals;"do not neglect god prasadam and do put it every where " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ పుష్పాన్ని అందుకున్న వెంటనే దేవేంద్రుడు దానిని ఐరావతం తలపై పెడతాడు&period; అది చూసిన దూర్వాసుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు&period; శ్రీమన్నారాయణుడి ప్రసాదం ఏదైనా అది అత్యంత పవిత్రమైనదిగా భావించి స్వీకరించాలనీ&comma; భక్తి భావంతో వ్యవహరించాలని చెబుతాడు&period; స్వామివారి ప్రసాదానికి ఎవరైతే తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెడతారో&comma; అలాంటివారికి లక్ష్మీదేవి దూరంగా వెళ్లిపోతుందంటాడు&period; లక్ష్మీదేవి లేని చోటు కళావిహీనమై అనేక కష్ట నష్టాలకు వేదికగా మారుతుందని అంటాడు&period; దుర్వాస మహర్షి పలుకుల మేరకు అసురుల కారణంగా ఇంద్రుడు తన పదవిని కోల్పోతాడు&period; దేవేంద్రుడు కొంతకాలం పాటు నానాఇబ్బందులు పడతాడు&period; ఆ తరువాత స్వామివారికి క్షమాపణ చెప్పుకుని తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువలన భగవంతుడి ప్రసాదంగా లభించినది ఏదైనా దానిని ఎంతో పవిత్రమైనదిగా భావించాలని ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదని పండితులు సూచిస్తున్నారు&period; ప్రసాదాన్ని భవ్యంగా స్వీకరించడం ద్వారా స్వామి వారి అనుగ్రహంతో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts