వినోదం

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ బ‌రువు త‌గ్గ‌డానికి అంత క‌ష్ట‌ప‌డ్డాడా.. సీక్రెట్ రివీల్..

Jr NTR : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌డం తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో దేవర 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు త‌న ప‌ర్స‌నాలిటీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రాఖీ సినిమా, ఆంధ్రావాలా చిత్రాల‌లో ఎన్టీఆర్ ఎంత లావుగా క‌నిపించాడో మ‌నం చూశాం. అస‌లు స్క్రీన్‌పై జూనియ‌ర్‌ని ఎవ‌రు అలా చూడ‌లేక‌పోయారు. దాంతో యమ‌దొంగ సినిమా స‌మ‌యానికి స్లిమ్‌గా మారాడు.

స‌ర్జ‌రీ చేయించుకున్నాడ‌ని అప్పుడు చాలా ప్ర‌చారాలు సాగ‌గా, వాటిని నిజ‌మే అని చెప్పాడు. అలాగే ఫుడ్ తీసుకునే విష‌యంలోనూ కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకొని స్లిమ్ లుక్‌లో వ‌చ్చాన‌న్నాడు ఎన్టీఆర్. యమదొంగ సినిమా కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. బ‌రువు త‌గ్గితేనే తాను సినిమా చేస్తాన‌ని రాజ‌మౌళి చెప్ప‌డంతో జూనియ‌ర్ స్లిమ్ గా మారారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన బాడీని చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. బరువు తగ్గడానికి ఎంతో కష్టపడిన తారక్, బరువు తగ్గిన తర్వాత మళ్లీ పెరగకుండా ఉండడం పైన కూడా అంతే దృష్టి సారించారు.

this is how jr ntr reduced his weight

జూనియర్ ఎన్టీఆర్ వెయిట్ తగ్గినప్పటి నుంచి ఒకటే డైట్ ఫాలో అవుతున్నాడని ఆ కారణంగానే ఆయన ఫిజికల్ ఫిట్నెస్ లో ఏ మాత్రం మార్పు రాలేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ ఉదయం లేవగానే యోగా గాని వర్కౌట్ గాని రెండు గంటలపాటు చేస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత ఉదయం రెండు గ్లాసుల రాగి జావా తాగుతారట. ఆపైన రెండు ఉడకబెట్టిన కోడి గుడ్లను తింటారట. ఆపై ఫ్రూట్ జ్యూస్ ల తోనే తారక్ ఎక్కువగా గడిపేస్తారట. ఇక మధ్యాహ్న భోజనంలో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉండేలా రాగి సంకటి, నాటుకోడి తింటారట. రాత్రిపూట నానబెట్టిన మొలకలు వచ్చిన తృణధాన్యాలు తప్ప మరేమి తినరట. ఇక రోజంతా మధ్యలో ఎప్పుడు ఆకలిగా అనిపించినా కేవలం ఫ్రూట్ జ్యూస్ లతోనే కడుపు నింపుకుంటారు అని సమాచారం.ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు, డీప్ ఫ్రై చేసే ఆహారాలు తారక్ అస్సలు ముట్టుకోరని అందుకే ఆయ‌న ఇలా స్లిమ్‌గా ఉంటున్నార‌ని స‌మాచారం.

Admin

Recent Posts