వినోదం

Divya Bharati : దివ్య‌భార‌తి చ‌నిపోయే ముందు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ.. ఏమ‌న్న‌దంటే..?

Divya Bharati : హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన దివ్య భారతి జీవితం అర్ధాంతరంగా ముగిసిన విష‌యం తెలిసిందే. ఎన్నో అనుమానాలు ఆమె మృతిపై ఉన్నాయి. సినిమాల‌లో త‌న అద్భుత‌మైన ప‌ర్‌ఫార్మెన్స్ తో ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది దివ్య భార‌తి. చాలా చిన్న వ‌య‌స్సులోనే త‌న అందంతో జ‌నాల‌కి పిచ్చెక్కించింది . దివ్య భారతి యుక్తవయసులో సినిమాల్లో నటించడం ప్రారంభించింది. దివ్య భారతి నటించిన మొదటి చిత్రం తమిళ చిత్రం నీల పెన్నే. అదే సంవత్సరం, ఆమె తెలుగులో బొబ్బిలి రాజా చిత్రంలో కూడా నటించింది, ఇందులో ఆమె వెంకటేష్ సరసన నటించింది ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆమె చిరంజీవి, మోహన్ బాబు మరియు నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర తెలుగు స్టార్లతో పని చేసింది.

తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచిత‌మైన దివ్య భార‌తి 1992 మే 10న సాజిద్ న‌డియావాలాని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం అయిన 10 నెల‌ల త‌ర్వాత ఆమె మ‌ర‌ణించింది.మ‌ద్యం మ‌త్తులో బాల్క‌నీ నుండి కింద ప‌డి మ‌ర‌ణించింది. దివ్య‌భార‌తి మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రికి తీర‌ని లోటు మిగిల్చింది. దివ్య భార‌తి మ‌ర‌ణం త‌ర్వాత ఆమె అసంపూర్తిగా ఉన్న చిత్రాల‌లో ఇత‌ర న‌టీమ‌ణులు న‌టించారు. అయితే సోనీలో ప్రసారమైన 1992లో తన చిత్రం గీత్ సెట్స్‌లో పాత ఇంటర్వ్యూలో, దివ్య అమితాబ్ బచ్చన్‌ను మొదటిసారి కలవడం గురించి మాట్లాడింది. ఒక స్టార్‌ని కలిసినప్పుడు తన అనుభవాన్ని పంచుకోమని అడిగినప్పుడు, దివ్య మాట్లాడుతూ, మా నాన్నకు అమితాబ్ బచ్చన్ తెలుసు, న‌న్నుప‌రిచ‌యాం చేశారు. అప్పుడు బిగ్ బీ కరచాలనం చేశాడు.

what divya bharati said in her last interview

అయితే ఇంటికి వ‌చ్చాక అమితాబ్ నాకు షేక్ హ్యాండ్స్ ఇచ్చార‌ని చెప్పాను. అప్పుడు మ‌మ్మీ న‌న్ను 10 రోజుల పాటు చేతులు కడుక్కోవద్దు అని చెప్పింది. కాని నేను చేతులు కడుక్కోవలసి వచ్చింది అంటూ దివ్య భార‌తి చెప్పుకొచ్చింది. దివ్య భార‌తి చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దివ్య భార‌తిని మ‌రో సారి సినీ అభిమానులు గుర్తు చేసుకొని చాలా బాధ‌ప‌డుతున్నారు. మంచి న‌టిని మిస్ అయ్యామంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Admin

Recent Posts