వినోదం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి అస‌లు కారణం.. ఆమె అనే విష‌యం తెలుసా ?

Pawan Kalyan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్, పవర్ స్టార్ లకు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా చేసినా.. చేయకపోయినా.. ఆయనకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఆయన్ను దేవుడిగా కొలుస్తారు. సోషల్ మీడియాలో ఏమైనా నెగెటివ్ కామెంట్స్ వచ్చినా ఒప్పుకోరు. ఇక సినిమాలతో పాటు ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఆయన హవా చాటుకుంటున్నారు. ఎంతో మంది యూత్ కి పవన్‌ స్పూర్తిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రతి సినిమాలో ఆయన మార్క్ ని ప్రజంట్ చేస్తూ.. బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొడుతున్నారు. పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

కొణిదెల వెంకటరావు, అంజనా దేవిలకు పవన్ కళ్యాణ్ జన్మించారు. ఈయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. చిరంజీవి, నాగబాబులకు ముద్దుల తమ్ముడిగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్ అవ్వడంతో ట్రాన్స్‌ఫర్‌ లు ఎక్కువగానే అవుతుండేవి. దీంతో పవన్ కళ్యాణ్ కు ఎడ్యుకేషన్ సాగలేదు. ఆ తర్వాత ఉన్నత చదువులకు కూడా ఇంట్రెస్ట్ లేక, ఇంట్లోనే మినీ లైబ్రరీని ఏర్పాటు చేసుకుని, పుస్తకాలు చదువుతూ ఉండేవారు. చిరంజీవి భార్య సురేఖ సహకారంతో పవన్ కళ్యాణ్ ను సినిమాల్లోకి పంపాలని అన్నారట. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో తెలిపారు.

this is the reason why pawan kalyan came into movies

అలా పవన్ వదిన సురేఖ ప్రోత్సాహించడంతోనే పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ గా మారారు. ఇప్పుడు ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుని పవర్ స్టార్ గా మారారు. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు అవుతున్న సందర్భంగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మూవీస్ లోకి రావడానికి సురేఖ ఎంకరేజ్ మెంట్ ఎంతో కారణం అని చెప్పవచ్చు.

Admin

Recent Posts