వినోదం

హీరోయిన్స్ మించి.. వంట‌ల‌క్క ఆస్తుల గురించి తెలిస్తే షాక‌వుతారు..

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం.ఇందులో వంట‌ల‌క్క‌గా న‌టించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది ప్రేమీ విశ్వనాథ్‌. కార్తీక దీపం సీరియ‌ల్‌లో త‌న న‌ట‌న‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని క‌ట్టిప‌డేసిన ఈ న‌టి స్టార్ హీరోయిన్ల‌కు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్న‌ది ఒకే ఒక్క సీరియ‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మిగిలిన ఏ సీరియ‌ల్ న‌టీన‌టులు ఆమెను బీట్ చేయ‌లేక‌పోతున్నారంటే ప్రేమి విశ్వ‌నాథ్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ మలయాళీ అందం ఈ మధ్య కాలంలో ఆమె సీరియల్స్‌తో పాటు యాడ్స్ కూడా చేయడం మొదలు పెట్టింది.

అయితే తాజాగా వంట‌ల‌క్క గురించి సెర్చ్ చేస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వంటలక్క లా చదివిందట. ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తుందట. ఇక దాంతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రేమీ విశ్వనాథ్ కు కేరళలో రెండు స్టూడియోలు ఉన్నాయట. ఇక ఈమె భర్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అని తెలుస్తుండ‌గా, ఆయన పేరు డాక్టర్ వినీత్ భట్.ఆయన 2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డ్ అందుకున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈమె తెలుగులో కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన దీప వ్యక్తిగతంగా మాత్రం చాలా రిచ్ అని తెలుస్తోంది.

vantalakka or premi vishwanath net worth and properties value

ఈమెకు ఉన్న స్టూడియోల‌లో మలయాళ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు, సీరియళ్ల షూటింగ్స్ జరుగుతాయని తెలుస్తోంది. అంతే కాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సబంధించి పనులు కూడా జరుగుతున్నాయట. ఈ అమ్మ‌డికి కోట్లలో ఆస్తులు ఉన్నాయంటూ వార్త హల్ చల్ చేస్తుంది. ఆమెకు దాదాపు 40 కోట్ల వరకూ ఆస్తులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వంటలక్క గురించి ఈ విషయాలు తెలిసినటువంటి ఎంతో మంది అభిమానులు వామ్మో వంటలక్క బ్యాగ్రౌండ్ ఈ రేంజ్ లో ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల‌తోను సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది.

Admin

Recent Posts