వినోదం

Raasi : హీరోయిన్ రాశి సినిమాలు మానేశాక ఆస్తులు పోగొట్టుకుందా..?

Raasi : టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అందాల భామ‌ల హవా న‌డుస్తున్న స‌మ‌యంలో త‌న న‌ట‌న‌తో అగ్ర తార‌గా ఎదిగిన ముద్దుగుమ్మ రాశి. హీరోయిన్ అవ్వకముందే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది..ఇక ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన లవ్ టుడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..తొలి సినిమాతోనే భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి కి తెలుగు మరియు తమిళం బాషలలో చాలా సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. పెద్ద పెద్ద హీరోల స‌ర‌సన కూడా న‌టించిన రాశి దశాబ్దం పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది . ప్ర‌స్తుతం సినిమాలకు దూరమై వ్యాపార రంగం లో గొప్పగా రాణిస్తూ అప్పుడప్పుడు తెలుగు మరియు తమిళం సీరియల్స్ లో నటిస్తూ ముందుకు పోతుంది.

రాశి వైవాహిక జీవితంకి సంబంధించి అనేక రూమ‌ర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.. 18 ఏళ్ళ వయస్సు లోనే తమిళ టాప్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ ని ప్రేమించి పెళ్లాడింది. అత‌నితో కొన్నాళ్లు క‌లిసి ఉన్న రాశి.. సురేష్ వర్మ ని వివాహం చేసుకుంది..వీళ్ళ మధ్య కూడా సఖ్యత కుదరకపోవడం తో మళ్ళీ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..ఇక చివరికి శ్రీనివాస్ అనే అతనిని పెళ్ళాడి ఇప్పుడు సంతోషంగా ఉంటుంది.

actress raasi told interesting facts about her film life

అయితే రాశి సినిమాలు మానేసాక ఆస్తులు కోల్పోయిందా, ఆమెకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్ర‌స్తుతం ఆమె జీవితం సంతోషంగానే ఉందా అనే అంశాల‌పై ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చింది. భ‌ర్త‌తో సంతోషంగానే ఉంటున్న త‌న‌కి ఎలాంటి స‌మ‌స్య లేదు అంటుంది. త‌ను సంపాదించ‌క‌పోయిన త‌న భ‌ర్త సంపాదిస్తున్నాడు కాబట్టి ఎలాంటి స‌మస్య లేదంటుంది. సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా కనిపించాలని భావిస్తున్నానని రాశి తెలిపారు. 5000 రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన రాశి ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.

Admin

Recent Posts