వినోదం

Venu Madhav : క‌మెడియ‌న్ వేణు మాధ‌వ్ అస‌లు ఎందుకు చ‌నిపోయాడు.. ఆయ‌న మ‌ర‌ణానికి కార‌ణం ఏమిటి..?

Venu Madhav : మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి, గొప్ప కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటుడు వేణుమాధవ్. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సంప్రదాయం చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. నాలుగో ఏట నుంచే మిమిక్రీ చేయడం ప్రారంభించాడు వేణుమాధవ్. లక్ష్మీ చిత్రంలో వేణుమాధవ్ తెలంగాణ శకుంతలతో చేసిన కామెడీ ఆ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచింది. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు వేణుమాధవ్. దిల్, సై, ఆది, సాంబ‌, శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి ఎన్నో చిత్రాలలో నటించి కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

వేణు మాధవ్ కి మంచి మిమిక్రీ ఆర్టిస్టుగా బుల్లితెర ప్రేక్షకులలో గుర్తింపు వచ్చిన టీవీ ప్రోగ్రాం వన్స్ మోర్ ప్లీజ్. రవీంద్ర భారతిలో వేణు మాధవ్ చేసిన ప్రోగ్రామ్స్ వల్ల ఆయన కెరీర్ మలుపు తిరిగి సంప్రదాయం సినిమాలో ఛాన్స్ వచ్చింది. సంప్రదాయం సినిమా కోసం వేణు మాధవ్ మొదటి చిత్రంలోనే ఏకంగా 70 వేల రూపాయల పారితోషికం తీసుకున్నాడు. వేణు మాధవ్ కు ఇష్టమైన నటుడు సీనియర్ ఎన్టీఆర్ కాగా ఆయనపై ఉన్న అభిమానంతో చాలా సందర్భాల్లో టీడీపీ తరపున ప్రచారం చేశాడు వేణు మాధవ్.

what is the reason for venu madhav death

రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్న వేణు మాధవ్ కొన్ని కారణాల వల్ల ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయాడు. 2019 సెప్టెంబరు 25న వేణు మాధవ్ మృతి చెందాడు. అప్పటి నుంచి వేణు మాధవ్ మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణు మాధవ్ చనిపోవడానికి మూడు నెలల ముందు ఆయన సోదరుడు మరణించాడని, ఆ సంఘటనతో వేణు మాధవ్ డిప్రెషన్ కు గురయ్యాడని ఆయన భార్య శ్రీవాణి వెల్లడించారు.

వేణు మాధవ్ కొడుకులు మాట్లాడుతూ నాన్నగారికి మద్యం అలవాటు ఉందని అయితే ఆయన మరణానికి కారణం మద్యం కాదని అన్నారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన తరువాత చికిత్స చేయించుకోకపోవడంతో ఊపిరితిత్తులు చెడిపోయి నాన్న మృతి చెందారని వేణు మాధవ్ కొడుకులు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Admin

Recent Posts