పోష‌కాహారం

Rajma Beans : వీటిని 12 గంట‌ల‌పాటు నాన‌బెట్టి తినండి.. షుగ‌ర్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు..

Rajma Beans : చాలామంది, ఈరోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. నిజానికి, మనం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, చాలా సమస్యలకి దూరంగా ఉండవచ్చు. చిక్కుడు జాతికి చెందిన రాజ్మా ని కూడా, చాలామంది వాడుతూ ఉంటారు. వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. రాజ్మా బీన్స్ ని తీసుకోవడం వలన, అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రాజ్మా ని తీసుకోవడం వలన, ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా, రాజ్మా తీసుకోవచ్చు.

మాంసాహారం తినని వాళ్ళు, రాజ్మా తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. రాజ్మాలో రాగితో పాటు ఐరన్, ఫాస్ఫరస్, మాంగనీస్ తో పాటుగా ఫోలేట్ కూడా ఉంటాయి. ఫైబర్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. కనుక, ఈ గింజలు తీసుకోవడం మంచిది. విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. జీర్ణక్రియని ఈజీగా చేస్తుంది. అదేవిధంగా, ఈ గింజలను తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్ ని కూడా పొందవచ్చు.

take rajma beans by soaking them 12 hours know the benefits

రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్లో ఉంచుతాయి. గుండె, కండరాల పనితీరు కూడా బాగుంటుంది. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. రాజ్మాలో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన, రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచి, రక్త ప్రవాహం బాగా జరిగేటట్టు చేస్తుంది. రాజ్మా ని తీసుకుంటే, నరాల బలహీనత, అలసట, నీరసం వంటివి కూడా ఉండవు. రాజ్మాలో ఉండే కరిగే ఫైబర్, ప్రోటీన్ యొక్క సమ్మేళనం బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకలి కూడా రాజ్మా తీసుకోవడం వలన తగ్గుతుంది.

ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఎముకలని బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. వయసు పెరిగి కొద్ది ఎముకలు సమస్య వస్తుంది. రాజ్మా ని తీసుకోవడం వలన, ఆ బాధలు ఉండవు. రాజ్మా తో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఈజీగా మనం తీసుకోవచ్చు. లేదంటే చక్కగా రాత్రిపూట నానబెట్టేసి, ఉదయం మీరు మీ వంటలో ఏదో ఒక రూపంలో వేసుకుని తీసుకుంటే, అదిరిపోయే లాభాలని పొందవచ్చు. పన్నెండు గంటలు నానబెట్టి తీసుకుంటే మంచిది. ఈ గింజలు తీసుకుంటే నీరసం కూడా బాగా తగ్గుతుంది. డయాబెటిస్, నరాల బలహీనత, అలసట వంటి సమస్యలు ఉండవు.

Admin

Recent Posts