వినోదం

రాజమౌళికి జగపతిబాబుకి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా ?

జగపతిబాబు, ఎస్ఎస్ రాజమౌళి చాలా దగ్గర బంధువులనే విషయం చాలామందికి తెలియదు. రాజమౌళి కొడుకు కార్తికేయ రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పటికే ఆకాశవాణి సినిమా నిర్మించిన ఇతడు వివాహం కూడా చేసుకున్నాడు. కార్తికేయ తన స్నేహితురాలు పూజ ప్రసాదును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పూజ ప్రసాద్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు సోదరుని కూతురే పూజా ప్రసాద్.

జగపతిబాబు సోదరుడైన రాంప్రసాద్ పూజ తండ్రి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నారు. రాజమౌళి తన వియ్యంకుడు అవుతాడని చెప్పుకొచ్చాడు. మరోవైపు జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ రోల్స్ తో బిజీ అవుతున్నారు. లెజెండ్, రంగస్థలం, అరవింద సమేత సినిమాలలో విలన్ పాత్రలను జగపతిబాబు అద్భుతంగా పోషించారు. విచిత్రం ఏమిటంటే జగపతిబాబు రాజమౌళి ఒక్క సినిమాలో కూడా విలన్ పాత్ర చేయలేదు.

what is the relation between jagapathi babu and rajamouli

మీరు మరీ అందంగా ఉంటారో లేక మీ మంచితనం వల్ల విలన్ రోల్ లో పెట్టుకోలేదని రాజమౌళి తనతో అన్నట్లు అన్నారని జగపతిబాబు తెలిపారు. తాను విలన్ రోల్స్ మాత్రమే కాదని ఎలాంటి రోల్స్ అయినా చేస్తానని ఆయనతో అన్నానని జగపతిబాబు చెప్పుకొచ్చారు. రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతారు. మరి రాబోయే సినిమాల్లోనైనా జగపతిబాబును పెట్టుకుంటే మరో అద్భుతమైన విలన్ ను చూసే అవకాశం దొరుకుతుంది.

Admin

Recent Posts