వినోదం

Jr.ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

తెలుగు ఇండస్ట్రీ లో అతి చిన్న వయసులోనే హీరో గా ఎంట్రీ ఇచ్చి, 21 ఏళ్లకే సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనం సృష్టించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 2001 లో వచ్చిన ఈ సినిమాలో రవీందర్ రాజ్ పుత్ హీరోయిన్, ఉషా కిరణ్ బ్యానర్ పై రామోజీరావు ఈ మూవీ నిర్మించారు. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కంటే ముందుగా 1997లో బాల రామాయణం సినిమా లో నటించారు. ఈ మూవీని ఎమ్మెస్ రెడ్డి నిర్మించగా, గుణశేఖర్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బెస్ట్ డైలాగ్ డెలివరీ, తనదైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ కు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు కూడా దక్కింది..

దీని తర్వాత 2001లో నిన్ను చూడాలని మూవీ ద్వారా హీరోగా కెరియర్ మొదలు పెట్టిన ఎన్టీఆర్, అదే ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నిన్ను చూడాలని మూవీ యావరేజ్ గా పిలిచింది. దీని తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా విజయవంతమైంది. ఈ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో గజాల హీరోయిన్ గా నటించారు. ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ వెనక్కి చూసుకోలేనంత స్టార్ అయిపోయారు. దీని తర్వాత డిసెంబర్ లో సుబ్బు, ఇందులో సోనాలి జ్యోతి హీరోయిన్. సురేష్ వర్మ దర్శకత్వం. కానీ ఈ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు.

do you know how much jr ntr took as remuneration for his first movie

అయితే నిన్ను చూడాలని సినిమా షూటింగ్ మొదలైనప్పుడు ఎన్టీఆర్ వయస్సు 17 సంవత్సరాలు. 2001 మే 25న ఈ మూవీ థియేటర్ లోకి వచ్చింది. ఇది తన మొదటి సినిమా దీనికి ఆయన అక్షరాల నాలుగు లక్షల పారితోషికం తీసుకున్నారట. ఈ సినిమా కి ఇచ్చిన అమౌంట్ ను ఎన్టీఆర్ ఏం చేయాలో తెలియక నేరుగా తీసుకెళ్లి వాళ్ల అమ్మ చేతిలో పెట్టారని ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో,రెమ్యూనరేషన్ తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోయింది. తాజాగా ఎన్టీఆర్ ఒక్క సినిమాకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Admin

Recent Posts