వినోదం

బాలీవుడ్ నటులు ఎందుకు ముంబైలో అద్దె ఇంట్లో ఉంటారు..? ఓహో ఇదా కారణం..!

బాలీవుడ్ నటులు చాలా మంది ముంబైలో ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉంటుంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఇంటిని అద్దెకి తీసుకుని ఉంటారు..? దాని వెనక కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటులు ముంబైలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండడం వెనక రెండు కారణాలు ఉండొచ్చు. ఎక్కువ వీళ్ళకి నెట్ వర్త్ ఎక్కువ ఉన్నా, అద్దె ఇళ్లలో ఉంటారు. ఇలా ఉండడానికి కారణం ప్రతిసారి ఒకే అమౌంట్ రాదు. ఒకసారి పెద్ద మొత్తంలో కలెక్షన్స్ ని సినిమా రాబడితే, ఒక్కోసారి ఫ్లోప్ అవుతుంది.

కారణం వాళ్లు ఇష్టపడే ప్రాంతంలో ఇల్లు అందుబాటులోకి ఉండకపోవచ్చు. చాలామంది నటీనటులు బాంద్రా, అంధేరీ వెస్ట్, వెర్సోవా వంటి నాగరిక ప్రాంతాల్లో ఉంటారు. ఇలాంటి చోట కొనుక్కోడానికి ఇల్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇక వీళ్ళు అద్దెకు ఎంత చెల్లిస్తారు అనేది కూడా చూద్దాం. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్, కృతి సనన్ వంటి బి-టౌన్ ప్రముఖులు ముంబైలోని అద్దె అపార్ట్మెంట్లలో ఉంటారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జుహులో అద్దెకు తీసుకున్నారు. రూ.1.75 కోట్లను డిపాజిట్‌ చేసారు.

why bollywood celebrities stay in rent houses

ఈ జంట నెలకు రూ.8 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కృతి సనన్ జుహులో డ్యూప్లెక్స్ ప్రాపర్టీని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఆమె ఇంటి యజమాని మరెవరో కాదు అమితాబ్ బచ్చన్. కృతి నెలకు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారట. రూ.60 లక్షల డిపాజిట్‌ను చెల్లించినట్లు కూడా తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్ షాహిద్ కపూర్‌ కి చెందిన ప్రాపర్టీలో అద్దెకు ఉంటున్నారు. జుహులోని తారా రోడ్‌లో అద్దెకు తీసుకున్న ఈ ఫ్లాట్ కి కార్తీక్ నెలకు రూ. 7.5 లక్షలు చెల్లిస్తున్నారు.

Peddinti Sravya

Recent Posts