వినోదం

లవ్ యు రాజా అనే పదం పోసానికి ఎందుకు మేనరిజంగా మారింది?

దాపరికం అనేదే తెలియదు. మనసులో ఏముంటే అదే చెప్తారు.. అదే చేస్తారు. ముక్కుసూటి మనిషి. నమ్మిన దాన్ని ఆచరిస్తూ, తెరమీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో ఒకరు నట – దర్శక – రచయిత పోసాని కృష్ణ మురళి. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేసే సమయంలో తన దగ్గర ఉన్న ప్రతిభా పాటవాలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు పోసాని. అలాగే సినిమాలలో కూడా మంచి పాత్రలు వేస్తూ అందరినీ అలరించారు. గోపాల గోపాల చిత్రంలో కామెడీ విలన్ గా, టెంపర్ సినిమాలో నిజాయితీపరుడైన పోలీసుగా.. ఇలా ఏ పాత్రనైనా పండించడం ఆయన ప్రత్యేకత.

అయితే కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. వారికి ఉన్న అలవాటుతోనే అందరూ వారిని గుర్తుపెట్టుకుంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది ఎప్పుడు మాటల మధ్యలో ఓకే పదాన్ని వాడి దానిని ఊతపదంగా మార్చేస్తారు. మన పోసాని కృష్ణ మురళికి కూడా ఇలా చాలా రకాల అలవాట్లు ఉంటాయి. తరచుగా ఆయన వేసుకున్న డ్రెస్ ని సరి చేసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తారు. ఏం మాట్లాడినా మధ్యలో రాజా అని, ఐ లవ్ యు రాజా అని అంటూ ఉంటారు. అయితే ఆయనకి ఊతపదం ఎలా అలవాటు అయిందంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకి ఐ లవ్ యు రాజా అనే ఊతపదం ఎలా అలవాటు అయిందో చెప్పుకొచ్చారు పోసాని.

why i love you raja dialogue became famous for posani krishna murali

ఓ పిల్లల టాలెంట్ షో కి నేను జడ్జిని. అక్కడికి వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా వారిని నొప్పించకుండా మాట్లాడడం కోసం మరోసారి ఇంకా బాగా చెయ్యి నాన్న అని చెబుతూ.. ఐ లవ్ యు రాజా అనేవాన్ని. అది బాగా పాపులర్ అయింది. దాంతో పిల్లలు కూడా నన్ను లవ్ యు రాజా అనసాగారు. అది తెలుగు నాట అంతటా పాపులర్ అయింది. ఆ తర్వాత ఈ డైలాగుని సినిమాలో కూడా పెట్టాను. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఆ డైలాగ్ పేలింది. అప్పటినుంచి ఐ లవ్ యు రాజా అనే మాట దేశమంతటా అందరూ వాడుతున్నారు అని చెప్పారు పోసాని. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీ నాయ‌కులు పెట్టిన కేసుల‌కు గాను కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు.

Admin

Recent Posts