వినోదం

Idiot Movie : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇడియ‌ట్ సినిమాని రిజెక్ట్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

Idiot Movie : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ హీరోగా రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఇడియ‌ట్ చిత్రం కూడా ఒక‌టి. 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కన్నడం లో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫాం లో ఉన్న పూరి ఈ సినిమాను ముందు కన్నడం లో డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఈ సినిమా కథ వినిపించగా.. రాజ్ కుమార్ కి బాగా నచ్చడంతో వెంట‌నే ఒకే చేశారు. ముందు ఈ సినిమాని తెలుగులోనే చేయాల‌ని అనుకున్నాడు పూరి.

అయితే పునీత్ రాజ్ కుమార్ ను లాంచ్ చేయడానికి ఎన్నో కథలు వింటున్నారు రాజ్ కుమార్. కాని మంచి కథలు దొరకకపోవడం పూరి చెప్పిన ఈ కథ బాగా నచ్చడం తో దాదాపు 2 గంటల పాటు కథ విని సినిమాను రాజ్ కుమార్ ఒకే చేయం జ‌రిగింది. అప్పు పేరుతో సినిమాని తెర‌కెక్కించ‌గా, ఆ సినిమా పేరే పునీత్ రాజ్ కుమార్ కు నిక్ నేమ్ అయిపోయింది. అప్పటి వరకు పరిశ్రమలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా మంచి జోష్ ఇవ్వ‌డంతో వెంటనే ఈ సినిమాను తెలుగులో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించాడు. అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కథ చెప్తే… తన ఇమేజ్ కు ఇది స‌రిపోదు వ‌ద్దు అని అన్నాడ‌ట‌.

why pawan kalyan rejected idiot movie

ఇక మహేష్ బాబుకి చెప్తే వివిధ కారణాలతో రిజెక్ట్ చేసారట‌. కాని రవితేజా మాత్రం సినిమా కథ విని వెంటనే ఒకే చేసారు. కన్నడం లో సూపర్ హిట్ కావడంతో అవ్వడంతో మరో ఆలోచన లేకుండా ఒకే చేసాడు. రవితేజా బాడీ లాంగ్వేజ్ కూడా ఈ సినిమాకు బాగా సెట్ అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఇడియట్” మాత్రమే కాకుండా “పోకిరి”.. ఇంకా చాలా సినిమాలు పవన్ రిజెక్ట్ చేయడం జరిగింది. చాలావరకు బ్లాక్ బస్టర్ సినిమాలు వదిలేసుకున్నారు. ఇడియట్ సినిమా కూడా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయినా కాని ఆడవాళ్ళు విషయంలో సమాజంలో చెడ్డ మెసేజ్ వెళుతుందని పవన్ ఈ సినిమా ఒప్పుకోకుండా పక్కన పెట్టడం జరిగిందని స‌మాచారం.

Admin

Recent Posts