Chiranjeevi : స్వయంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ఎంతో మందికి స్పూర్తి. ఆయనని చూసి ఇండస్ట్రీకి చాలా మంది హీరోలు వచ్చారు. ఇప్పటికీ కుర్రహీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న చిరంజీవి విశ్వంభర చిత్రంతో పలకరించబోతున్నాడు. అయితే చిరు తన కెరీర్ మొదట్లో విలన్ గా నటించి మెప్పించి ఆ తరవాత హీరో పాత్రలు చేసిన విషయం తెలిసిందే. చిరు హీరోగా ఎదుగుతున్న తీరు ఆయన క్రమ శిక్షణ చూసి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖను ఇచ్చి వివాహం చేశారు. అయిత చిరు ఓ తప్పు చేసుంటే అసలు అల్లు వారి ఫ్యామిలీకి అల్లుడు అయ్యిండే వాడు కాదట.
చిరంజీవిని తన అల్లుడిగా చేసుకునే ముందు అల్లు రామలింగయ్య చాలా ఎంక్వైరీలు చేశాడట. తన కుమారుడు అరవింద్ ను పిలిచి చిరు గురించి తెలుసుకోవాలని ఆరా తీయాలని చెప్పడంతో.. అల్లు అరవింద్ చిరుతో పనిచేసిన పలువురు నటీనటులను దర్శకనిర్మాతలను కలిసి ఆరా తీసారు. దాంతో ప్రతిఒక్కరూ మెగాస్టార్ గురించి గొప్పగా చెప్పారట. దీంతో ఇదే విషయాన్ని అరవింద్ తన తండ్రికి చెప్పాడు. ఇక చిరంజీవి అల్లు రామలింగయ్య ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి ట్రైన్ లో ప్రయాణించారట.
ఆ రోజున అల్లు రామలింగయ్య వైన్ గ్లాస్ తీసుకుని చిరంజీవిని తాగమని చెప్పగా, ఆయన తనకు అలవాటు లేదని చెప్పారట. దాంతో అల్లు రామలింగయ్య అప్పుడే చిరు తన అల్లుడు అని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ చిరు అల్లు రామలింగయ్య ఆఫర్ చేసిన వైన్ తాగి ఉంటే రామలింగయ్య మరో నిర్ణయం తీసుకొని ఉండేవారేమో అని కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే చిరుని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ మధ్య మెగాఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటికి అల్లు అరవింద్ చెక్ పెట్టిన విషయం విదితమే.