వినోదం

కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయ‌న యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని ఆట ప‌ట్టించే వారా..? ఎందుక‌ని..?

సూప‌ర్ స్టార్ కృష్ణ‌ను అప్ప‌ట్లో ఆయన యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని పిలిచేవారు. ఇందుకు ఉన్నవి రెండే కారణాలు – మొదటిది – ఆరోజుల్లో జరిగిన ఫ్యాన్ వార్, అదే అభిమానుల యుద్ధం. రెండవది – కృష్ణ చేసే డ్యాన్స్. 1970ల్లో కృష్ణ తెలుగు సినిమా తెరకు స్టార్‌డమ్ తీసుకువచ్చారు. కొత్త తరహా సినిమా ధోరణులు వచ్చాయి. ఫైట్లు, భారీ సెట్టింగులు, విదేశీ సినిమాల అనుకరణలు, లౌడ్‌ కథలు, సినిమాల్లో కొత్త సాంకేతికత, సగటు ప్రేక్షకుడిని మెప్పించేందుకు అంటూ మోతాది మించిన మోటు శృంగారం – ఇలా. అప్పటికే రామారావుకు గొప్ప ఇమేజ్ ఉండి ఫేడవుట్ అవుతోందా అనిపించే స్థితి. హఠాత్తుగా రామారావు ఈ కొత్త తరహా సినిమా ధోరణుల్లోకి ఎలాగోలా ఇమిడి, ఇందులోనూ భారీ స్టార్ అయిపోయారు. ఒక భారీ పోటీ ప్రారంభమైనట్టే అయింది. మరోపక్క నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణంరాజు కూడా తమ స్థాయిలో ఈ పోటీలో నిలిచారు. అప్పటికే ఉన్న సంక్రాంతి సినిమాల పోటీ ఈ స్టార్‌డమ్ పోటీకి ఓ అద్దంలా ఉండేది.

ఇదిలా ఉండగా – ఊళ్ళలో కుర్రాళ్ళు కూడా మా ఫేవరెట్ హీరో ఫలానా అని అభిమాన సంఘాలు పెట్టుకోవడం, అభిమాన హీరో సినిమా విడుదలకు హంగామా చేయడం – ఇలా చేసేవారు. ఈరోజుల్లోలా హీరోలు ఏడాదికొక సినిమా చేసే రోజులు కావు. 1972లో కృష్ణ సినిమాలు 18 విడుదలయ్యాయి. అంటే నెలకు దాదాపు రెండు సినిమాలు. మరీ ఇన్ని సినిమాలంటే తన సినిమాలకు తన సినిమాలే పోటీ అవుతున్నాయని తగ్గించుకున్నా కనీసం నెలన్నరకు ఒక సినిమా విడుదల చేసేవారు ఉన్న పెద్ద హీరోలందరూ. ఆనాటి సినిమా సందడి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సినిమా పిచ్చి సామాన్యం కాదు.

why some anti fans called krishna as bendu appa rao

దర్శకుడు వై.వి.యస్.చౌదరి గారు ఒకసారి తన చిన్ననాటి అనుభవాలు చెప్తూ ఆ రోజుల గురించి చెప్పారు. ఆయన చిన్నతనం నుంచి రామారావు అభిమాని. తొమ్మిదో తరగతిలో ఉండగానే తమ స్నేహితులను పోగేసి గుడివాడలో ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించారట. ఇది కాక వేర్వేరు హీరోలకూ ఆ పిల్లల్లోనే వీరాభిమానులూ, శూరాభిమానులూ, ధీరాభిమానులూ ఉండేవారు. వీళ్ళందరూ ఆదివారం ఊళ్ళో పార్కులో సమావేశమై తమ హీరోల సినిమాల గురించి చర్చించుకునేవారు. ఇక, చర్చలు ముదిరి అవతలి హీరోల మీద తిట్ల వర్షం కురిసేదని మనం ఊహించవచ్చు. ఎన్‌టీఆర్ అభిమానులు ఏఎన్నార్ పోస్టర్ల మీద, ఏఎన్నార్ అభిమానులు ఎన్టీఆర్ పోస్టర్ల మీద పేడ కొట్టేవారనీ, దానికి ఏఎన్నార్ ఒకసారి వేదిక మీద అలా కొట్టిన పేడ ఎరువులా పనిచేసి మేమిద్దరం ఇంతగా ఎదిగామని స్పోర్టివ్‌గా అన్నట్టు అనక్‌డోట్ ఉంది.

అలా అవతలి హీరోని తిడుతూ, అవతలి హీరో అభిమానులను ఏడిపించాలంటే ఏదో ఒక తిట్టు ఉండాలి కదా. అలాంటి ఆయుధమే ఈ బెండు అప్పారావు. అందుక‌నే కృష్ణ‌ను ఆయ‌న యాంటీ ఫ్యాన్స్ బెండు అప్పారావు అని పిలిచేవారు. అలాగే కృష్ణ‌కు డ్యాన్స్ రాదు క‌నుక ఆ ర‌కంగా కూడా ఆయ‌న అభిమానుల‌ను ఇదే పేరుతో పిలుస్తూ ఏడిపించేవారు.

Admin

Recent Posts